ఆ నలుగురికి ఉద్వాసన?

Posted February 5, 2017 (3 weeks ago)

4 ministers are going to become ex
ఏపీ మంత్రివర్గ విస్తరణ ఖాయమని ప్రచారం జరుగుతోంది. లోకేశ్ బాబు మినిస్టర్ అవ్వాలంటే.. క్యాబినెట్ ను పునర్ వ్యవస్థీకరణ చేయక తప్పదు. లోకేశ్ సహా ఆరుగురిని చంద్రబాబు టీంలోకి తీసుకుంటారని టాక్. అయితే కొత్తగా ఆరుగురిని తీసుకునేముందుకు కొందరిపై వేటు పడే ఛాన్స్ ఉందన్న వార్తలొస్తున్నాయి.

చంద్రబాబు క్యాబినెట్ లో నుంచి నలుగురిపై వేటు పడబోతోందని సమాచారం. ఆ నలుగురిలో మొదటి వ్యక్తి మంత్రి రావెల కిశోర్ బాబేనని తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్య ఆయన పేరు తరచుగా వివాదాల్లో ఉంటుంది. ఒకటి రెండు సార్లు బాబు స్వయంగా చెప్పినా… రావెల మాత్రం పాత రూట్లోనూ వెళ్లున్నారు. కాబట్టి ఆయనకు చెక్ తప్పకపోవచ్చని టాక్.

ఇక పీతల సుజాతకు పదవీ గండం ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. మంత్రిగా పీతల సుజాత పెర్ఫామెన్స్ పై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. కాబట్టి ఆమెపై వేటు వేసేందుకే ఎక్కువ అవకాశాలున్నాయని టాక్. ఇక మృణాళిని విషయంలోనూ అంతే. ఒక మంత్రిగా ఉన్న మృణాళిని కనీసం మీడియాలోనైనా కనిపించరన్న విమర్శలున్నాయి. మినిస్టర్ గా ఉన్న ఆమె పేరు అటు పేపర్ లోనూ, ఇటు ఛానల్స్ లోనూ కనిపించడం చాలా అరుదుగా జరుగుతోంది. ఈ వ్యవహారం విమర్శలకు తావిస్తోంది.

ఇక సీనియర్ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని కూడా బాబు కేబినెట్ నుంచి తప్పిస్తారట. అయితే అనారోగ్య సమస్యల వల్లే.. ఆయనే రిజైన్ కు సిద్ధంగా ఉన్నారని టాక్. ఇక చంద్ర‌బాబు ఎంతో ఆశ‌లు పెట్టుకున్న అచ్చెన్నాయుడు మాత్రం ప‌నితీరులో వెనుక‌బ‌డ్డార‌ట‌. అందుకే ఆయ‌నపై బాబుకు చాలా అసంతృప్తి ఉందట. కానీ ఎర్రన్నాయుడు సెంటిమెంటుతో ఆయనకు లాస్ట్ ఛాన్స్ లభించిందని సమాచారం. మొత్తానికి త్వరలో నలుగురు మంత్రులు మాజీలు కావడం ఖాయమని టీడీపీ క్యాడర్ కూడా గుసగుసలాడుకుంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY