ఆ పిల్లాడి ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేంటా..!

Posted November 13, 2016 (4 weeks ago)

4th class student asked two questions to Modi
4th class student asked two questions to Modi

నోట్ల రద్దు వ్యవహారంపై నాలుగో తరగతి చదువుతున్న ఒక కుర్రాడు అడిగిన రెండు ప్రశ్నలకు మోదీ కూడా సమాధానం చెప్పలేరంటా.. మరి అంత ఇబ్బంది పెట్టే ప్రశ్నలేంటో చూద్దామా…
ఒకటవ ప్రశ్న… చాలా ప్లానింగ్‌తో పెద్ద నోట్లును రద్దు చేశారని చెబుతున్నారు కదా..రద్దు చేయడానికి 10, 15 రోజుల ముందు నుంచి ఏటీఎంలలో పెద్ద నోట్లు పెట్టడం మానేసి కేవలం 100 రూపాయాల నోట్లే పెడితే ఇప్పుడు జనాలకు ఈ సమస్య రాదు కదా మరి ఎందుకు చేయలేదు.. ?
రెండో ప్రశ్న… ఆరు నెలల నుంచి మైసూరు ప్రెస్‌లోకొత్త నోట్ల ముద్రణ జరిగిందని చెబుతున్నారు కదా.. మరి వాటిపై రెండు నెలల క్రితమే ఆర్బీఐ బాధ్యతలు తీసుకున్న ఉర్జిత్‌ పేరు ఎలా పెట్టారు..?
.. ఇవి ఆ బుడతడు అడిగిన ప్రశ్నలు.. మరి మోదీ సమాధానం చెబుతాడా అంటూ.. సోషల్‌మీడియాలో ప్రశ్నలు సంధిస్తూన్నారు నెటిజన్లు..

NO COMMENTS

LEAVE A REPLY