బాప్రే.. అమీర్ అంత తీసుకున్నాడా…

Posted March 20, 2017

aamir khan gets remuneration in dangal movieవిలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు అమీర్  ఖాన్  ప్రస్తుతం సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌, థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ సినిమాల్లో  నటిస్తున్నాడు. కాగా  ఆయన నటించిన సినిమాలు దాదాపు అన్నీ  బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంటాయి. సినిమా కలెక్షన్ల విషయంలోనే కాకుండా రెమ్యునరేషన్ లో కూడా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్  ముందున్నాడని తెలుస్తోంది.

అమీర్ నటించిన ‘దంగల్‌’ సినిమా బాలీవుడ్‌లో 2016లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమాకు అమీర్‌ దాదాపు రూ.175 కోట్లు తీసుకున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. డిస్నీ యూటీవీ సంస్థతో  కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సినిమా చిత్రీకరణకు ముందు అడ్వాన్స్‌ గా రూ.35 కోట్లు తీసుకున్నాడట. ఇక అగ్రిమెంట్ ప్రకారం 33% వాటా, శాటిలైట్‌ రైట్స్‌, సినిమా విడుదలయ్యాక వచ్చే కలెక్షన్స్‌ లో మరో 33%వాటా తీసుకున్నట్లు సమాచారం.   దీంతో బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా అమీర్‌ ఖాన్ గుర్తింపు పొందాడు. 

Post Your Coment
Loading...