ABN @పవన్ కళ్యాణ్ ..

0
273

  abn md radha krishna focused pawan kalyan janasena party
పవన్ కళ్యాణ్ తిరుపతి సభ ప్రకటన వచ్చిన దగ్గరనుంచి ABN ఆంధ్రజ్యోతి ఛానెల్ ఆ అంశానికి విపరీత ప్రాధాన్యం ఇస్తోంది.చంద్రబాబుకి అనుకూలమని ఆరోపణలు ఎదుర్కొనే పత్రిక పవన్ సభకి ఈ స్థాయి ప్రాధాన్యం ఇవ్వడం జనసేన వర్గాలని కూడా ఆశ్చర్యపరుస్తోంది.మిగతా చానెల్స్ కన్నా abn తమకి ఇంత ప్రచారం కల్పించడం సంతోషంగావున్నా ఎక్కోడో ఓ మూల సందేహం ఉందని సభాప్రాంగణంలో ఉన్న అభిమాని ఒకరు వ్యాఖ్యానించారు.ఎందుకని ప్రశ్నిస్తే ఆయన ఆసక్తికర సమాధానమిచ్చాడు.

ప్రజారాజ్యం ఏర్పాటు నాటి పరిస్థితుల్ని సదరు అభిమాని గుర్తు చేసుకున్నాడు.ఆంధ్రజ్యోతి అప్పట్లో ఇంతకన్నా ఎక్కువే ప్రజారాజ్యానికి ప్రచారం ఇచ్చిందని ….కానీ నిర్ణయాత్మక దశ వచ్చేసరికి ప్లేట్ మార్చిందని ఆ అభిమాని వాపోయాడు.గతంలో ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు abn ఎండీ రాధాకృష్ణ ఓ సమాధానం ఇచ్చారు .ఎప్పటి పరిస్థితులకు తగ్గట్టే అప్పుడు వ్యవహరించాము తప్ప స్వీయ ప్రయోజనాలు చూసుకోలేదన్నారు.ఆ అభిమాని డౌట్ ..abn సమాధానం ఈ సందర్భానికి అచ్చు గుద్దినట్టు సరిపోతాయేమో ..

NO COMMENTS

LEAVE A REPLY