ఆర్టీసీ డ్రైవర్ అయిన ఏపీ మంత్రి

Posted April 21, 2017 (6 days ago) at 12:00

acham naidu turns as garuda bus driver
అసెంబ్లీ లో విపక్షం మీదకి జెట్ స్పీడ్ తో దూసుకెళ్లి వారి ఆరోపణల్ని బుల్డోజ్ చేసే మంత్రి అచ్చెన్నాయుడు కొత్త అవతారం ఎత్తారు.కాసేపు బయట గరుడ బస్సు డ్రైవర్ గా రయ్యిరయ్యి మనిపించారు.మరో మంత్రి గంటా శ్రీనివాసరావు,కొందరు అధికారుల్ని ఎక్కించుకుని విజయవాడ రోడ్ల మీద కాసేపు గరుడ బస్సుని పరుగులెత్తించారు.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 100 ఏసీ బస్సులు కొంది.వాటిలో 15 అందుబాటులోకి వచ్చాయి.వాటిని విజయవాడ పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ నుంచి మంత్రులు ప్రారంభించారు.ఆ సందర్భంగానే అచ్చెన్నాయుడు డ్రైవర్ అవతారం ఎత్తారు.

Post Your Coment
Loading...