చిన్నమ్మ క్యాంపు లో తిరుగుబాటు..

Posted February 9, 2017 (3 weeks ago)

aiadmk mlas revolt on sasikala
తెలుగుబుల్లెట్ చెప్పిందే నిజమని తేలింది.శశికళ వర్గం మీటింగ్ అని పిలిచి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్ని వారికి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా దాదాపు బందీల్ని చేసిందని తెలుగుబుల్లెట్ నిన్న ఇచ్చిన కధనాన్ని బలపరిచే ఘటనకు చెన్నై వేదికగా నిలిచింది.శశికళ క్యాంపు నుంచి బయటకు వెళతామని దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.తమకు సెల్ ఫోన్స్ ఇవ్వకుండా ఇలా నిర్బంధించడం ఏంటని క్యాంపు నిర్వాహకులతో వాదనకు దిగినట్టు తెలుస్తోంది. తమని వెంటనే బయటకు పంపకపోతే పోలీస్ కేసు దాకా వెళ్తామని ఘాటుగా హెచ్చరించారు.దీంతో శశి వర్గం అయోమయంలో పడింది.శశి క్యాంపు లో ఈ రాత్రికి మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ప్లేట్ ఫిరాయించి పన్నీర్ కి జై కొట్టే అవకాశముందని తెలుస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY