ఐశ్వర్యకు ఇదే మొదటిసారట ..!

0
56

Posted November 14, 2016 (3 weeks ago)

aishwarya rai ae dil hai mushkil movie crossed 100 crores
బిగ్ బి కోడలు ఐశ్వర్య రాయ్ కి ఇదే మొదటిసారి ఆట…హలో ఎక్కువ ఊహల్లోకి వెళ్లొద్దు అంతలేదు .మేటర్ ఏంటంటే .‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాతో బాలీవుడ్ దర్శకుడు కరణ్‌ జోహార్‌, హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ తొలిసారిగా వంద కోట్ల క్లబ్‌ లో చేరారు ఇదే మ్యాటర్ .

రెండో వారంలో ఏ దిల్ హై ముష్కిల్ సినిమా వసూళ్లు రూ. 100 కోట్లు దాటాయి. అక్టోబర్ 28న విడుదలైన ఈ సినిమా రెండు వారాల్లో రూ. 104.86 కోట్లు వసూలు చేసింది. విదేశాల్లోనే రూ.73.42 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్‌ ఎనలిస్ట్‌ లు వెల్లడించారు. కరణ్‌ జోహార్.. రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ దిల్ హై ముష్కిల్’లో రణబీర్‌ కపూర్‌, అనుష్క శర్మ, ఐశ్వర్యరాయ్‌ ముఖ్యపాత్రల్లో నటించారు.

రణబీర్‌ కపూర్‌ నటించిన సినిమాలు వందకోట్లు దాటడం ఇది మూడోసారి ఐతే . యే జవానీ హై దీవానీ, బర్ఫీ ఇంతకుముందు వందకోట్లు వసూలు చేశాయి. అనుష్క శర్మ నాలుగోసారి ఈ ఘనత అందుకుంది. జబ్‌ తక్‌ హై జాన్‌, పీకే, సుల్తాన్‌ సినిమాలు భారీ కలెక్షన్లు సాధించాయి. ఐశ్వర్యరాయ్‌ నటించిన సినిమా వంద కోట్లు వసూలు చేయడం ఇదే మొదటిసారి..

NO COMMENTS

LEAVE A REPLY