అజిత్ ఫస్ట్ లుక్ అదుర్స్!!

Posted February 2, 2017

ajith vivivegam first look superతమిళ్  హీరో అజిత్ కి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. శివ దర్శకత్వంలో అజిత్ తాజాగా నటిస్తున్న సినిమా దాదాపు కంప్లీట్ అయ్యింది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అజిత్‌ సరసన కాజల్‌, అక్షరాహాసన్‌ నటిస్తుండగా బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబ్ రాయ్ విలన్‌గా కనిపించనున్నాడు. కాగా  కోలీవుడ్‌ హిట్‌ కాంబోలో వస్తున్న ఈ సినిమా టైటిల్‌ ను కానీ, ఫస్ట్‌ లుక్‌ ని  కానీ ఇప్పటివరకు విడుదల చేయని చిత్రయూనిట్‌… నిన్న రాత్రి ఈ రెండింటిని ఒకేసారి రిలీజ్ చేసి అభిమానులను కనువిందు చేసింది.

ajith vivivegam first look super‘వివేగమ్‌’ అనే టైటిల్‌తో రిలీజైన అజిత్‌  ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌  ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంది.  అజిత్ ఫస్ట్ లుక్ కి టాలీవుడ్ హీరోలు సైతం ఫిదా అయిపోతున్నారు. బాహుబలిలో బల్లాలదేవగా నటించి టాలీవుడ్ కండలవీరుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా…  ట్విట్టర్‌ లో అజిత్ పోస్టర్‌ను పోస్ట్ చేయడంతో పాటు ‘వావ్.. వావ్.. వావ్.. ఔట్ స్టాండింగ్’ అంటూ ట్వీట్ చేశాడు. అజిత్‌ నిజంగా రాక్ స్టార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు రానా. 

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY