“వీడెవడు” చెప్పండంటున్న అఖిల్

Posted February 7, 2017 (3 weeks ago)

akhil posted photo in twitter veedevadu movie pre look
”వీడెవడు”… అంటూ అఖిల్ ట్వీట్ చేసిన ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన టీమ్ మేట్ లోని ఒకరి సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను పోస్ట్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్నదెవరో గుర్తించండని అఖిల్ ప్రశ్నించడమే అందుకు కారణం. కాగా ‘వీడెవడు?’ అన్న టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీలుక్ లో హీరో వెనక్కి తిరిగి ఉండగా, మర్డరర్, ఫైటర్, విలన్, గ్యాంబ్లర్ అంటూ పోస్టర్ నిండా రాతలున్నాయి.

అఖిల్ ఈ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చెయ్యడంతో ఈ పోస్టర్ లో ఉన్నది నితిన్ అని ఎక్స్పెట్ చేశారు. అయితే తమిళ్ హీరో ఆర్య ”యార్ ఇవాన్?” అంటూ తమిళ్ పోస్టర్ ని ట్వీట్ చేశాడు. ఈ హీరో ఒక క్రికెటర్ అని.. బాలీవుడ్ సూపర్ స్టార్ అని.. అతను తమిళంలో డెబ్యూ చేస్తున్నాడని హింట్ ఇచ్చాడు. దీంతో ఈ ప్రీ లుక్ పోస్టర్లో ఉన్నదెవరని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, జాన్ అబ్రహాం, హర్షవర్ధన్, సచిన్ జోషి వంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజంగా వీడెవడు పోస్టర్ లో ఉన్న వీడెవడో తెలియాలంటే ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఫస్ట్ లుక్ వరకు వెయిట్ చెయ్యక తప్పదు.

NO COMMENTS

LEAVE A REPLY