తనపై వచ్చిన విమర్శలకు నోరు విప్పిన అక్షయ్‌ కుమార్‌

Posted April 25, 2017 (5 weeks ago) at 18:31

Akshay Kumar said Take It Back If You Want about On National Award
ఇటీవల ఏ అవార్డు ఫంక్షన్‌ జరిగినా వాటిపై విమర్శలు వస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల విషయంలో కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సెలక్షన్‌ కమిటీలో ఉన్న వారు తమకు అనుకూలమైన వారికి లేదా, వారికి ఇష్టమైన వారిని అవార్డులకు ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ నుండి తమిళ ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ వరకు కూడా అంతా జాతీయ అవార్డుల ఎంపిక విషయంలో రాజకీయాలు జరిగాయని, ఉత్తమ నటుడిగా అక్షయ్‌ కుమార్‌ ఎలా ఎంపిక అయ్యారో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

బాలీవుడ్‌లో గత సంవత్సరం విడుదలైన ‘రుస్తుం’ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అలాగే అక్షయ్‌ కుమార్‌ బాగా నటించాడని అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అయితే అక్షయ్‌ కుమార్‌ ‘రుస్తుం’ కంటే మంచి సినిమాలు, అతడి కంటే మంచిగా నటించిన వారు ఉండగా ఆయనకే ఇవ్వడం వెనుక రాజకీయం జరిగిందనేది ఆరోపణ. అవార్డు ఎంపిక జ్యూరీ కమిటీలో ప్రియదర్శన్‌ పూర్తిగా అక్షయ్‌కు మద్దతుదారు. ఆ కారణంగానే అక్షయ్‌కు అవార్డు వచ్చిందని అంటున్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై అక్షయ్‌ కుమార్‌ స్పందించాడు.

‘రుస్తుం’ సినిమాకు గాను తాను అవార్డు తీసుకోవడం ఎంతో మందికి మానసిక క్షోభకు గురి చేసింది. వారు ఎంతగా నాకు అవార్డు వచ్చినందుకు బాధపడుతున్నారో అర్థం అవుతుంది. నాకు బదులుగా ఈ అవార్డును ఎవరు తీసుకునా నాకు ఇబ్బంది లేదు అంటూ అక్షయ్‌ తనపై విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్‌ ఇచ్చాడు. మరి ఇప్పటికి అయినా అక్షయ్‌పై విమర్శలు ఆగుతాయేమో చూడాలి.

Post Your Coment
Loading...