కరుణానిధే ముఖ్యమంత్రా.?

Posted [relativedate]

alagiri said karunanidhi always cm in my self
ఓడిన పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? ఈ డౌట్ మీకొచ్చిందేమో గానీ కరుణతో విభేదించి దూరమైన అయన పెద్ద కుమారుడు అళగిరికి మాత్రం ఆ డౌట్ రాలేదు.నా దృష్టిలో కరుణ ఎప్పుడు ముఖ్యమంత్రే …మళ్లీ అయన సీఎం అవుతారంటూ అళగిరి అంటున్నారు. తమ్ముడు స్టాలిన్ కి పార్టీ పగ్గాలు అప్పగించడం మీద అలిగి తండ్రికి దూరంగా ఉంటున్న అళగిరి ఇటీవల కరుణ అనారోగ్యం పాలు కావడంతో వరసగా మూడు సార్లు ఆయన్ని కలిశారు.ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడినట్టు చెబుతున్నారు.అళగిరిని మళ్లీ పార్టీలోకి తీసుకోడానికి కరుణ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నట్టే వుంది.అయితే అళగిరి మాత్రం కరుణ సీఎం అంటూ మరోసారి స్టాలిన్ ని నాయకుడిగా ఒప్పుకోబోనని పరోక్షంగా చెప్పినట్టు అయింది.చూద్దాం తాజా ఎపిసోడ్ ఎక్కడికి దారి తీస్తుందో?