AP మంత్రుల చాంబర్లన్నీ ఒకే సైజు..

0
66

  all ap ministers chambers same size secretariat

ఒక్కో మంత్రికి ఒక్కో పరిమాణంలో చాంబర్లు నిర్మించడంతో  మంత్రులకు కోపం వచ్చింది. దీంతో నష్టనివారణ చర్యలు ప్రారంభించిన సర్కార్..  తాజాగా మంత్రుల చాంబర్లన్నీ ఒకే పరిమాణంలో ఉండాలని నిర్ణయించింది. దీంతో రెండేసి గదులను కలిపి ఒక చాంబర్‌గా తయారుచేస్తున్నారు. ఇందుకోసం గదుల మధ్యలో ఉన్న గోడలను తీసేసి మరమ్మతులు చేస్తున్నారు.

మంత్రిత్వ శాఖలను తాత్కాలిక సచివాలయంలోని వివిధ బ్లాకుల్లో కేటాయిస్తూ ముందు ప్రకటించిన షెడ్యూల్‌లో సీఆర్‌డీఏ కీలక మార్పులు చేస్తోంది. ఇంతకుముందు  చేపట్టిన నిర్మాణాల్లో… కేబినెట్‌లోని కొందరు మంత్రులకు పెద్ద చాంబర్లు, మరికొందరికి చిన్న చాంబర్లను సీఆర్‌డీఏ కేటాయించింది. రెవెన్యూ, హోంలాంటి పెద్ద శాఖలకు కూడా మిగతా అన్ని శాఖల తరహాలోనే కార్యాలయ స్థలం కేటాయించడంతో అవి అభ్యంతరం వ్యక్తం చేశాయి.దీనిపై సంబంధిత శాఖల మంత్రులు… ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

దీంతో సీఆర్‌డీఏ అధికారులు అప్రమత్తమై మంత్రులందరికీ ఒకే సైజులో చాంబర్లు నిర్మించే దిశగా పనులు మొదలుపెట్టారు. కానీ, దీనివల్ల మరో సమస్య ఎదురైంది. ఇప్పటి వరకూ ఒక్కో బ్లాక్‌ను ఐదుగురు మంత్రులకు కేటాయించగా… ఇప్పుడు మంత్రుల చాంబర్ల సైజు పెంచడంతో ఒక్కో బ్లాక్‌లో ముగ్గురు మంత్రుల కంటే ఎక్కువ మందిని సర్దుబాటు చేయలేరు. 

NO COMMENTS

LEAVE A REPLY