బన్నిని బుట్టలో వేసుకుందా..?

Posted [relativedate]

allu arjun select keerti suresh for his nextసరైనోడు హిట్ తో తన సత్తా చాటిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దువ్వాడ జగన్నాథంగా రాబోతున్నాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దెతో రొమాన్స్ చేస్తున్నాడు బన్ని. ఇక ఈ సినిమా తర్వాత కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుస్వామితో చేసే సినిమా డిస్కషన్స్ లో కూడా పాల్గొంటున్న బన్ని ఆ సినిమా హీరోయిన్ విషయంలో ఓ క్లారిటీకి వచ్చాడట.

నేను శైలజ అంటూ ఓ హిట్ కొట్టి ఆ తర్వాత నాని నేను లోకల్ అంటూ రాబోతున్న కీర్తి సురేష్ ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఇప్పటికే త్రివిక్రం, పవన్ సినిమాకు అమ్మడు ఓకే అవగా మహేష్ కొరటాల శివ మూవీకి ఆమె సైన్ చేస్తుందని అంటున్నారు. ఇక ఈ క్రమంలో అల్లు అర్జున్ లింగుస్వామి మూవీకి ఆమెను తీసుకోబోతున్నారట. మొత్తానికి బన్నిని కూడా బుట్టలో వేసుకుంది ఈ అమ్మడు.

తనకు వచ్చిన అవకాశాలే వస్తాయ్ తను మాత్రం ఎక్స్ పోజింగ్ చేసేదు లేదు అంటూనే స్టార్స్ అందరితో సూపర్ హీరోయిన్ గా ఛాన్సులు కొట్టేస్తుంది మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.