విడాకులిచ్చినా ప్రేముందన్న అమలా..

Posted November 22, 2016 (3 weeks ago)

amala paul says vijay and me divorce but still i love vijay
ప్రేమ,.పెళ్లి …విడాకులు అన్ని స్పీడ్ స్పీడ్ గా జరిగిపోయాయి హీరోయిన్ అమలా పాల్ జీవితంలో.అయితే అందరిలా ఆమె జరిగినదానికి ఎవరినో నిందించి సానుభూతి తెచ్చుకుందామని ప్రయత్నించడం లేదు.ఇప్పటికీ తాను భర్త విజయ్ ని ప్రేమిస్తున్నట్టు అమల చెప్పారు.జరిగినదాంట్లో తప్పొప్పులు ఎంచడానికి ఆమె ఇష్టపడలేదు.ఒక్క విషయంలో మాత్రం అమల కాస్త బాధపడ్డారు. 18 ఏళ్ల వయసులో హీరోయిన్ అయిన తాను 23 సంవత్సరాలకే పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేదని అన్నారు.అంటే ఇంకాస్త వయసు పెరిగాక పెళ్లి చేసుకొనుంటే పరిణితితో ఆ సమస్యని అధిగమించగలిగేదాన్నని ఆమె అభిప్రాయం కావచ్చు.అందుకే అమల విడాకుల్ని తన జీవితంలో తీసుకున్న అతి కష్టమైన,కఠినమైన నిర్ణయంగా ఆమె చెప్పుకున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY