బాబుని వేశ్యతో పోలుస్తారా?

Posted November 10, 2016 (5 weeks ago)

ambati rambabu compared to chandrababu call girl
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? వైసీపీ కి ఈ సామెత బాగా వర్తిస్తుంది.సీఎం ని చెప్పుతో కొట్టాలని పిలుపిచ్చిన జగన్ నాయకత్వంలో పనిచేసే వాళ్ళు ఎలా వుంటారో అంబటి రాంబాబు మరోసారి నిరూపించాడు.బాబు సర్కార్ అభివృద్ధి చేస్తుంటే జగన్ అడ్డుపడడం లేదని చెప్పడానికి అంబటి ప్రెస్ మీట్ పెట్టారు. బాబు,లోకేష్ ఆరోపించినట్టు వైసీపీ కి అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశం లేదన్నారు.అంతవరకు బాగానే వుంది.

ఆ తరువాతే అంబటి రెచ్చిపోయారు.జగన్ ని అనేంత సీన్ లోకేష్ కి లేదన్నారు .అది మీ అభిప్రాయం.అది నిజమో కాదో కాలమే తేలుస్తుంది.బాబుని చూస్తుంటే కన్యాశుల్కం లో మధురవాణి పాత్ర గుర్తొస్తుందని నోరు పారేసుకున్నారు.బాబుని కాదు ఓ ముఖ్యమంత్రిని వేశ్యతో పోలిస్తే ఇంకేమి చెబుతాము.ఇలా అన్న రాంబాబుకి గుర్తుందో లేదో కానీ రాష్ట్రమంతా అయ్యగారి సరస సంభాషణ విన్న విషయం ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికీ గుర్తు చేయాల్సిన పనిలేదు.కానీ అంబటి ని చూసాక ఓ మాట చెప్పాలనిపిస్తోంది.మనం కళ్ళకి నల్ల కళ్లద్దాలు పెట్టుకుని ఎదుటోడు నల్లగా వున్నాడని భావిస్తాం .ఏమి చేస్తాం !ఏ జోడు పెట్టుకుంటే చూసే వాళ్ళు అలానే కనిపిస్తారుగా?

NO COMMENTS

LEAVE A REPLY