అవసరానికే భారతీయులు.. అదీ వీసాల కథ

Posted April 21, 2017 (2 weeks ago) at 10:21

america australia britain and new zealand put conditions for visa to indiansస్వేచ్ఛా వాణిజ్యం, మేధో వలస, బ్రెయిన్ డ్రెయిన్.. ఇలా ఎన్నో పేర్లతో గొప్పగా పిలుచుకునే వలస విధానం అంతర్జాతీయంగా అట్టర్ ఫ్లాపైంది. ప్రశాంతంగా ఎవరి పని చేసుకునే వారిని తమ దేశంలోకి రమ్మంటూ ఆహ్వానించి.. తీరా అవసరం తీరగానే పొమ్మంటూ తరిమేస్తున్నాయి విదేశాలు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ ప్రారంభిస్తే.. దానికి ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్ జత కలిశాయి. తమ పౌరులకు ఉద్యోగాలు రావడం లేదనే సాకుతో.. విదేశీయులకు వీసాల జారీలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ దేశాలు.
ఇప్పటివరకూ ప్రపంచ వేదికలపై స్వేచ్ఛా వాణిజ్యం గురించి సొల్లు చెప్పిన ఈ దేశాలు.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతాయోనని అంతా ఎదురుచూస్తున్నారు. వలసలతోనే అభివృద్ధి సాధ్యమని ఉచిత స్పీచులు దంచేసిన అమెరికా.. ఇప్పుడు రక్షణాత్మక వైఖరికే ప్రాధాన్యత ఇస్తోంది. మన వనరులు, మన ఉద్యోగాలతో ప్రశాంతంగా ఉన్న ఇండియాను ఉచ్చులోకి లాగి.. ఇప్పుడు ఎవరికి వారు షాపులు మూసేస్తున్నారు. మరి సేల్స్ మేన్లు ఏమైపోవాలనే ప్రశ్నకు సమాధానం లేదు. విదేశీ మోజులో పడ్డ యువతు గట్టి గుణపాఠమే నేర్పాయి ఇతర దేశాలు.

ఇప్పటికైనా భారత్ కళ్లు తెరవాలని నిపుణులు కోరుతున్నారు. గుడ్డిగా విదేశీ కంపెనీల్లో మనవారికి ఉద్యోగాలు ఇప్పించకుండా, అవసరమైన నైపుణ్యాలతో మన కంపెనీలనే అభివృద్ధి చేయాలని సూచిస్తున్నారు. అమెరికా సిలికాన్ వ్యాలీ ఇండియన్ల చలవతోనే మెరుగుపడింది. అయినా ఎలాంటి కృతజ్ఞతా లేకుండా తరిమేస్తున్నారు. పోనీ ఇన్నాళ్లైనా వారితో సమానంగా చూశారా అంటే అదీలేదు. ఎప్పుడ సెకండ్ గ్రేడ్ గానే చూశారు. జీతాలు వారి కంటే తక్కువే ఇచ్చారు. ఎన్నారైలంటే మనం గొప్పగా చెప్పుకోవడమే కానీ.. అక్కడ ఎంత వాల్యూ ఉంటుందో మొన్నా మధ్య ఓ స్టూడెంట్ పెట్టిన వీడియో కుండబద్దలు కొట్టంది. అందుకే దూరపు కొండలు నునుపు అనే సామెత గుర్తుచేసుకుని.. యువత తమ మేధస్సును దేశాభివృద్ధికి ఉపయోగించాలని మేధావులు సూచిస్తున్నారు.

Post Your Coment
Loading...