అఫీషియల్ : బాలయ్య ‘రైతు’కి డేట్స్ ఇచ్చిన అమితాబ్

 Posted October 21, 2016

 amitabh bachchan giving dates balayya rythu movie

నందమూరి బాలకృష్ణ విజ్ఝప్తిని ఓకే చేశాడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్.కృష్ణ వంశీ దర్శకత్వంలో బాలయ్య 101వ చిత్రంగా ‘రైతు’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు అమితాబ్ వంటి నటుడు చేస్తేనే బాగుంటుందన్న ఉద్దేశంతో బాలకృష్ణ, కృష్ణవంశీ కలసి ప్ర‌త్యేకంగా ముంబయ్ వెళ్లి ఆయనను కలసి, రిక్వెస్ట్ చేశారు. పాత్ర ప్రాధాన్యతని స్వయంగా బాలయ్య బిగ్ బీకి వివరించారు. కథ విన్న తర్వాత తన నిర్ణయాన్ని త్వరలో చెబుతానని బిగ్ బీ బాలయ్యకి తెలిపారు.

తాజాగా, ‘రైతు’లో నటించడానికి అమితాబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతేకాదు…  ఈ సినిమా కోసం ఫిబ్రవరి నెలలో 17 రోజుల కాల్ షీట్స్ కూడా ఆయన అప్పుడే కేటాయించినట్టు సమాచారం. దీంతో.. ముందు అమితాబ్ పై సన్నివేశాలని చిత్రీకరించేందుకు కృష్ణవంశీ ప్లాన్ చేసుకొంటున్నట్టు సమాచారమ్. బాలయ్య ‘రైతు’ అమితాబ్ చేరికతో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ పెరిగిపోవడం ఖాయం. ఈ చిత్రం డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

Post Your Coment
Loading...