అంత కోపం ఎందుకమ్మా.. అనసూయమ్మా..?

Posted February 10, 2017

anasuya item song in winner movieగోపీచంద్ మలినేని దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా విన్నర్. ఈ సినిమాలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఓ ఐటెం సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. సూయ.. సూయ అంటూ సాగే ఆ పాట కోసం ఆమె 25లక్షలు తీసుకుందన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కాగా ఈ పాట చిత్రీకరణ పట్ట పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

బుద్ధుడి విగ్రహం ముందు అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే అదే రేంజ్ లో ప్రశ్నించిన వారికి దిమ్మ తిరిగేలా ఆన్సర్ ఇచ్చింది ఈ బుల్లితెర బ్యూటీ.

‘ఈ స్పెషల్ సాంగ్ ను ఉక్రెయిన్ లో  బుద్ధ బార్ అనే పేరు గల ఓ పబ్ లో చిత్రీకరించామని, అది తాము సెట్ చేసింది కాదని, అక్కడ ఆల్రెడీ ఉన్నదే అని ఆన్సర్ ఇచ్చింది. గూగుల్ కి వెళ్లి బుద్ధ బార్స్ గురించి ఎంక్వైరీ చేసుకుంటే.. ఈ బుద్ధ బార్స్ చెయిన్ గ్రూప్ గురించి తెలుస్తుందని చెబుతూనే ఆమె… అక్కడి జనాలకు బుద్ధుడి విగ్రహం ముందు పార్టీలు చేసుకుని డ్యాన్సులు చేసుకోవడానికి ఇబ్బంది లేనపుడు.. ఓ పాట తీస్తే తప్పేంటట అని ఎదురు ప్రశ్నించింది. తమ ఉద్దేశ్యం జనాలను ఎంటర్టెయిన్ చేయడమే  అన్న అనసూయ.. ఆర్టిస్టులను గౌరవించడం చేతకాని జనాలకు.. దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 

అనసూయ ఇచ్చిన స్ట్రాంగ్ డోస్ తో కాస్త వెనక్కి తగ్గిన నెటిజన్లు.. అనసూయకు  అంత కోపమెందుకు, అసలు గతంలో ఐటెం సాంగ్స్ చేయనని చెప్పి ఇప్పుడు ఎలా చేసిందని కూల్ గా ప్రశ్నిస్తున్నారు. దీనికి అనసూయ ఎలాంటి కౌంటర్ వేస్తుందో చూడాలి.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY