అనసూయకు చుక్కలు చూపించిన హీరో..!

Posted November 27, 2016

Image result for sai dharam tej and anasuya

బుల్లితెర మీద వచ్చిన హాట్ ఇమేజ్ తో సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది అనసూయ. ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేయగా ఇక రాబోతున్న మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ సినిమాలో ఐటం గాళ్ గా కనిపించబోతుంది అమ్మడు. ఇప్పటికే ఆ సాంగ్ షూట్లో పాల్గొన్న అమ్మడు తేజు స్పీడ్ ను అందుకోలేకపోయా అంటూ చెప్పుకొచ్చింది. అంతేనా పర్ఫెక్ట్ మెగా వారసుడు అంటే తేజుని చూస్తే అర్ధమవుతుందని.. స్టన్నర్, అమేజింగ్, వెరీ డెడికేటెడ్ పర్సన్ అంటూ మోసేస్తుంది అనసూయ.

ఐటం సాంగ్ కోసం చుక్కలు చూపించాడని తెలుస్తుంది. అనసూయ లాంటి హాట్ భామే అలా చెప్పింది అంటే ఇక తేజు స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. గోపిచంద్ మలినేని డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాకు విన్నర్ అని టైటిల్ పెట్టారు. వరుస హిట్లతో హుశారుగా ఉన్న సాయి ధరం తేజ్ కు తిక్క సినిమా ఓ షాక్ ఇచ్చింది. అందుకే ఈసారి మళ్లీ తన మార్క్ ఎంటర్టైనింగ్ సినిమాతో సాయి ధరం తేజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Post Your Coment
Loading...