ఆర్సీ భవన్… నీదా.. నాదా.. సై

 Posted May 9, 2017 (3 weeks ago) at 16:53

andhra pradesh and telangana fight for resident commissioner bungalowఢిల్లీ సాక్షిగా తెలుగు ఆత్మగౌరవాన్ని వీధుల్లో తాకట్టుపెడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలయ్యాక పరువు మరింతగా బజార్న పడుతోంది. మొన్నటి వరకూ ఏపీ భవన్ లో వాటాల పంపకం కోసం కొట్టుకున్న రెండు తెలుగు రాష్ట్రాలు.. ఇప్పుడు రెసిడెంట్ కమిషనర్ బంగ్లా తమదంటే.. తమదని వాదించుకుంటున్నాయి. ఒకప్పుడు ఢిల్లీలో ఏపీ భవన్ అంతే ఎంతో విలువుండేది. ఇప్పుడు రెండు రాష్ట్రాల పోట్లాటల పుణ్యమా అని ఇతర రాష్ట్రాల వాళ్లు అసలు భవన్ వైపు కన్నెత్తి చూడటమే మానేశారు.

ఏపీ భవన్ ను 58:42 నిష్పత్తిలో పంచుకోమని కేంద్ర చెప్పింది. అందుకు తగ్గట్లుగానే గత మూడేళ్లుగా గొడవలు సద్దుమణిగాయి. అయితే రెసిడెంట్ కమిషనర్ బంగ్లా.. తెలంగాణకు కేటాయించిన శబరి బ్లాక్ కు సమీపంగా ఉండటంతో.. కొత్త సమస్యలు మొదలయ్యాయి. రెసిడెంట్ కమిషనర్ బంగ్లాను ఎవరెవరికో కేటాయిస్తున్నారని, వారి కారణంగా శబరి బ్లాక్ లో బస చేసే ప్రముఖులకు సెక్యూరిటీ సమస్యలు వస్తున్నాయని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. సమస్య నిజంగా ఉంటే.. చర్చించాల్సింది పోయి.. తాళం పెట్టడంతో.. అసలు రగడ మొదలైంది.

రెసిడెంట్ కమిషనర్ బంగ్లా తమదేనని, మీరెలా తాళాలు వేస్తారని ఏపీ అధికారులు వాగ్వాదానికి దిగారు. తెలంగాణ అధికారులు వేసిన తాళం బద్దలుకొట్టారు. చివరకు రెండు రాష్ట్రాల అధికారులు రెండు తాళాలు వేసుకుని వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ భవన్ పంచాయితీ తేల్చేసరికి కేంద్రానికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇప్పుడు ఆర్సీ బంగ్లా పంచాయితీ కూడా మోడీని తేల్చాల్సి ఉంది. మరి మిత్రుడు చంద్రబాబు మాటకు విలువిస్తారా.. లేదంటే రహస్య స్నేహితుడు కేసీఆర్ మాట మన్నిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

Post Your Coment
Loading...