పూజాకి పవన్ పిలుపు..!

Posted [relativedate]

Another Lucky Heroine To Pair With Pawanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ఈమధ్యనే ముహుర్తం జరిగింది. చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా కీర్తి సురేష్ ఓకే అయ్యిందని తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పూజా హెగ్దెని ఫిక్స్ చేస్తున్నారట. ముకుందా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమాలో చేస్తుంది.

సౌత్ సినిమాలు చేస్తూనే హృతిక్ మొహెంజోదారో ఛాన్స్ రాగానే అక్కడికి షిఫ్ట్ అయిన పూజా మళ్లీ తెలుగు ఆఫర్స్ రాగానే పరుగెత్తుకుంటూ వచ్చింది. ఇప్పటికే బన్ని సినిమా ఛాన్స్ కొట్టేసి క్రేజ్ సంపాదిస్తే ఇప్పుడు పవన్ తో కూడా నటిస్తూ సత్తా చాటుతుంది ఈ అమ్మడు. అందం అభినయం కలగలిపిన ఈ సుందరి ఈ రెండు ఛాన్సులు సరిగ్గా వాడుకుంది అంటే ఇక స్టార్ హీరోయిన్ గా దశ తిరిగినట్టే.

తెలుగులో చేసిన రెండు సినిమాలతోనే యువత మనసు దోచిన పూజా బన్ని, పవన్ సినిమాలతో ప్రేక్షకులందరిని తన బుట్టలో పడేయడం ఖాయమని చెప్పొచ్చు.