ఏపీ అసెంబ్లీ సమావేశాలు కుదింపు…

 ap assembly meetings only 3 days

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు మూడు రోజులపాటు మాత్రమే జరగనున్నట్టు సమాచారం. శాసనసభ  బడ్జెట్  సమావేశాలు మార్చిలో జరిగాయి. ఆరు నెలల్లోగా సభ తిరిగి సమావేశం కావాల్సి ఉంది. ఆ మేరకు సెప్టెంబర్ 29వ తేదీలోగా సభ తిరిగి సమావేశం కావాల్సి ఉంది. కాగా జీఎస్టీ బిల్లును  పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదించింది. ఆ బిల్లును మెజారిటీ రాష్ట్రాలు ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుంది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్ని రాష్ట్రాల సీఎంలకు ఈ మేరకు లేఖలు రాశారు.

దీంతో ఆ బిల్లు ఆమోదం నిమిత్తం రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరచాల్సి ఉంది. పనిలో పనిగా వర్షాకాల సమావేశాలను కూడా నిర్వహించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. టీడీపీ  అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్ని ఐదు రోజులపాటు మాత్రమే నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి మూడు రోజులపాటే ఈ సమావేశాలను నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం.

శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు సెప్టెంబర్ ఒకటి నుంచి పదో తేదీ వరకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగే కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావే శాల్లో పాల్గొనే అవకాశముంది. ఆ తరువాత లేదా అంతకుముందుగా కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ వివిధ దేశాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో స్పీకర్ కోడెల కూడా ఉంటారని సమాచారం. ఆయన పర్యటననుబట్టి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీల్ని ఖరారు చేస్తారు.

NO COMMENTS

LEAVE A REPLY