RK పై పోలీస్ బాస్ కామెంట్…

 Posted [relativedate]

ap dgp sambasiva rao comment on maoist leader rkమావోయిస్టులు, ప్రజా సంఘాలు మైండ్ గేమ్ ఆడతారన్న విషయం రుజువైందని ఎపి డిజిపి ఎన్.సాంభశివరావు వ్యాఖ్యానించారు. మావోయిస్టు అగ్ర నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) తమ అదీనంలో లేరని చెబితే అంగీకరించకుండా కోర్టుకు వెళ్లారని, ఇప్పుడు వారే పోలీసుల వద్ద లేరని ఒప్పుకున్నారని ఆయన అన్నారు. రామకృష్ణ ఎక్కడ ఉన్నడో ప్రజా సంఘాలు చెప్పాలని ఆయన ఎదురు డిమాండ్ చేశారు.తాము మొదటి నుంచి ఊహిస్తున్నదే నిజం అయిందని , గత ఇరవై ఏళ్లుగా మావోయిస్టులు ఇదే మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన అన్నారు.హైకోర్టులో పోలీసులకు వ్యతిరేకంగా పిటషన్ దాఖలు చేసినవారు ఇప్పుడు ఏమి జవాబు చెబుతారని డిజిపి ప్రశ్నించారు. రాజ్యాంగంపై నమ్మకం ఉండి కోర్టును ఆశ్రయించిన వారు ఇప్పటికైనా ఆర్‌కే ఎక్కడున్నాడో చెప్పాలని డీజీపీ కోరారు.

ఆర్కే క్షేమంగా ఉన్నాడంటూ విరసం నేత వరవరరావు ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో డీజీపీ పైవిధంగా స్పందించారు.