ఆ నల్ల డబ్బు ప్రజలకిచ్చేయ్ జగన్…

0
45

Posted November 25, 2016 (2 weeks ago)

ap ministers are said to jagan giving your black money to the people
పెద్ద నోట్ల ను రద్దు చేసి 17 రోజులు గడిచిన తర్వాత వైస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ గళం విప్పడం హాస్యాస్పదం గ ఉందని నోట్లను మోడీ రద్దు చేస్తే ముఖ్య మంత్రిని విమర్శించటం అయన ఆవగాహన రాహిత్యానికి గీటు రాయి అని రాష్ట్ర మంత్రులు రావెల కిశోర్‌బాబు, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్‌ లు అన్నారు ..

తాను దోచుకున్న లక్షల కోట్లు ఏమవుతాయోనన్న భయంతో జగన్‌ మాట్లాడుతున్నారు అని తన వద్ద వున్న నల్ల డబ్బును మార్చుకునేందుకే.. నగదు మార్పిడి గడువును పొడిగించాలని ప్రధానికి జగన్‌ లేఖలు రాస్తున్నారని దేవినేని ఉమ అన్నారు. రద్దుచేసిన 17 రోజుల తర్వాత బయటకు వచ్చి పొడిగించాలని ఏ ముఖం పెట్టుకుని లేఖలు రాస్తున్నారని ప్రశ్నించారు. స్పోక్స్ మెన్ లు మాట్లాడతారని అనడం చూస్తుంటే ప్రజా సమస్యల పట్ల ఎంత అవగాహన ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. నగదు రహిత లావాదేవీల కోసం రూపేకార్డులు తీసుకోవాలని సీఎం చంద్రబాబు చెబుతుంటే.. జగన్‌ అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని ఇప్పటికైనా ప్రభుత్వానికి అప్పగించి ప్రజలకు అప్పగించాలని అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY