Ap లో పేపర్ లెస్ పాలన …

 ap secretariat velagapudi

హైదరాబాద్‌ నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫైల్‌ కూడా ఏపీ సచివాలయానికి చేరలేదు. పాలనకు సమయం సమీపిస్తోంది. అయినా అధికార యంత్రాంగంలో టెన్షన్ కనిపించడంలేదు. మరి దసరా నాటికి ఏపీ నుంచి పూర్తి స్థాయి పాలన ఎలా సాధ్యం? ప్రభుత్వం మదిలో ఏముంది? దసరా నాటికి ఏపీ నుంచి పూర్తి స్థాయి పాలన కొనసాగించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. నిర్ధిష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. అన్ని శాఖల సెక్రటరీలు, ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు ప్రాణిగ్రహి సమావేశమయ్యారు. అక్టోబర్‌ 3 నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే అన్ని శాఖల విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రతీ శాఖకు ఒకరిద్దరు అధికారులను హైదరాబాద్‌లో ఉంచాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం అధికారికంగా ఆదేశాలు జారీ చేస్తారని సమాచారం. 

అటు వెలగపూడి సచివాలయంలో పూర్తి స్థాయిలో పేపర్‌ లెస్‌ పాలన నడిపే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలియవచ్చింది. అందుకు అనుగుణంగా హైదరాబాద్‌ సచివాలయం నుంచి ఒక్క ఫైల్‌ కూడా వెలగపూడి సచివాలయానికి తరలించవద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. అక్టోరబర్‌ 3 లోపు పరిశ్రమల శాఖ, మైనింగ్‌ శాఖ వచ్చే అవకాశం లేకపోవడంతో దసరా తర్వాత వెలగపూడికి రావాలని ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Post Your Coment
Loading...