అమ్మ ఎప్పుడు వెళ్తానన్నా ఓకే…

Posted November 12, 2016 (4 weeks ago)

apollo chairman prathap c reddy said jayalalitha will be discharged soon తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పూర్తిగా మెరుగైందని అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రకటించారు.అమె అంతకుముందు లాగా అందరినీ పలకరిస్తున్నట్టు అయన చెప్పారు. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే విషయంలో మాత్రం అపోలో నిర్ణయం తీసుకోలేదు.ఆరోగ్య పరంగా ఇబ్బందులు లేవు కాబట్టి అమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డిశ్చార్జ్ చేస్తామని ప్రతాప్ రెడ్డి ప్రకటించారు.దీంతో జయ నిర్ణయాన్ని బట్టే అమె డిశ్చార్జ్ ఉంటుంది.

మంచి రోజు,ముహూర్తం చూసుకుని జయ డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది.ఇందుకోసం శశికళ తదితరులు జ్యోతిష్కుల సలహాలు తీసుకుంటున్నట్టు…వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.అంటే వారు చెప్పినదాన్ని బట్టి జయ …అమె చెప్పినట్టు అపోలో వైద్యులు డిశ్చార్జ్ ప్రక్రియ పూర్తి చేస్తారన్నమాట.

NO COMMENTS

LEAVE A REPLY