అమ్మ టీ ఇస్తా అన్నారు ..అపోలో నర్సుల ఆవేదన ..

Posted December 8, 2016
apolo nurses sorrow about amma

జయలలితకు తాను అపోలో ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వెళ్తాననే నమ్మకం చాలా గట్టిగా ఉందని హాస్పిటల్ లో ఆమెకి సేవలందించిన నర్సులు అంటున్నారు అంతే కాదు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ఏం చేయాలనే విషయాలను కూడా ఆమె ప్రణాళిక వేసుకొన్నారట .

ఆ విషయాల్లో కొన్నింటిని అక్కడి నర్సులతో కూడా పంచుకున్నారు. ”నేను ఏం చేయాలో మీరు చెప్పండి, చేస్తాను” అనే ఆమె చాలా సందర్భాల్లో అన్నారని తెలిపారు. తాము ఆమె వద్దకు వెళ్లినప్పుడు పలకరింపుగా నవ్వేవారని, తమతో మాట్లాడేవారని, చాలా సందర్భాల్లో తమతో సహకరించేవారని షీలా అనే నర్సు చెప్తున్నారు ..

**ఆమెకు ఎంతగానో ఇష్టమైన ఉప్మా, పొంగల్, దద్దోజనం, బంగాళాదుంప కూర.. వీటన్నింటినీ ఆమె వ్యక్తిగత కుక్ ఆమెకోసం వండిపెట్టేవాడని తెలిపారు.

**అపోలో ఆస్పత్రి కాఫీ ఆమెకు అస్సలు నచ్చేది కాదు. అందుకే ఒకరోజు మొత్తం నర్సులు, డాక్టర్లు అందరినీ పోయెస్ గార్డెన్‌కు రమ్మని చెప్పారు. ”రండి, మా ఇంటికి వెళ్దాం. అక్కడ మీకు కొడైనాడు నుంచి తెప్పించి బెస్ట్ టీ ఇప్పిస్తాను” అని ఆమె చెప్పారట .

**ఆమెకు మూడు షిఫ్టులలో మొత్తం 16 మంది నర్సులు సేవలందించారు. వాళ్లలో షీలా, ఎంవీ రేణుక, చాముండేశ్వరి అంటే జయలలితకు చాలా ఇష్టమట. 75 రోజుల పాటు తమ ఆస్పత్రిలో ఉన్న ఆమె చాలా సందర్భాల్లో సరదాగా, సహకరిస్తూ, అప్పుడప్పుడు కష్టంగా ఉండేవారని అపోలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది చెప్పారు.

**బాగా అలిసిపోయినప్పుడు డ్యూటీ డాక్టర్లతో మాట్లాడేవారని, వాళ్ల హెయిర్ స్టైల్ మార్చుకోవాల్సిందిగా ‘ఆదేశించేవార’ని కూడా అన్నారు.

**ఎంత బిజీగా ఉన్నా మహిళలు తమమీద తాము శ్రద్ధ పెట్టాలని తరచు చెప్పేవారని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సత్యభామ అన్నారు.చాలా నీరసంగా, అస్సలు మాట్లాడలేని స్థితిలో కూడా ఆమె తన రాజసాన్ని ఏమాత్రం వదులుకోలేదు. ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలే ఆమెను సహకరించమని గట్టిగా చెబుతూ, ఆస్పత్రిలో తానే బాస్ అని చెప్పగా..

** ఆమె నీరసంగా ‘ఈ రాష్ట్రం మొత్తం నా అడ్డా’ అని సైగ చేశారట

** నవంబర్ 22వ తేదీన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తంజావూరు, అర్వకురుచ్చి, తిరుపరంకుంద్రమ్ స్థానాల్లో అన్నాడీఎంకే విజయం సాధించిన విషయాన్నికూడా జయ టీవీలో చూశారని, అప్పుడు చిన్నగా నవ్వారట

*** ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా పరిస్థితి మొత్తం తలకిందులైపోయింది. ఆమె ఒక పాత తమిళ నాటకాన్ని చూస్తున్నప్పుడు ఒక ఇంటెన్సివిస్ట్ ఆమె గదిలోకి వెళ్లారు. ఆమె నవ్వలేదు, మాట్లాడలేదు. చూస్తుంటే శ్వాస అందడం కష్టం అవుతున్నట్లు తెలిసింది. అప్పటికి వెంటిలేటర్ సరిచేసేసరికే ఆమె చుట్టూ ఉన్న మానిటర్లు అన్నింటిలోనూ గీతలు అడ్డంగా సరళరేఖల్లా వచ్చేశాయి. అంటే.. ఆమెకు కార్డియాక్ అరెస్ట్ అయిందని అర్థం.

*** ‘నన్ను ఆమె తమిళనాడు అసెంబ్లీకి కూడా తీసుకెళ్తానన్నారు’ అంటూ ఆ నర్సు గద్గద స్వరంతో కళ్ళ నీళ్ల పర్యంతం అయింది.

NO COMMENTS

LEAVE A REPLY