చిన్నమ్మ వెనక జ్యోతిష్యం కథ!!

Posted February 6, 2017

astrology behind sashikala
శశికళ తమిళనాడు సీఎం కావడం ఖాయం కానీ.. ఇంకొంత టైమ్ పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఇంత తొందరపడతారని మాత్రం ఎవరూ ఊహించలేదు. చిన్నమ్మ ఆరాటానికి జ్యోతిష్యులే కారణమని ప్రచారం జరుగుతోంది.

చిన్నమ్మ మన్నార్గుడి జ్యోతిషుల మాటను ఎక్కువగా నమ్ముతారట. ఏళ్ల నుంచి వారు చెప్పినట్టే చేస్తున్నారని టాక్. శశికళకు సీఎం యోగముందని మన్నార్గుడి సిద్ధాంతి గారు గతంలోనే చెప్పారట. జయ అనారోగ్యం సమయంలోనూ మన్నార్గుడి జ్యోతిష్యుల సలహాలనే చిన్నమ్మ పాటించారట. అమ్మ మరణం తర్వాత ఆమె కొన్ని పూజలు చేశారట. వాటి ఫలితం వల్లే ఆమెకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని టాక్.

సీఎం ఛాన్స్ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాలని శశికళ భావించారు. కానీ మన్నార్గుడి జ్యోతిష్యుల వల్లే ఆమె ఈ విషయంలో తొందర పడ్డారట. ఎందుకంటే ఈనెలలో మంచి ముహూర్తబలం ఉందని చిన్నమ్మకు చెప్పారట సిద్ధాంతి గారు. ఈనెల దాటితే సీఎం పీఠం ఎక్కినా.. కష్టాలు పడాల్సి వస్తుందని సూచించారని టాక్.

మొత్తానికి మన్నార్గుడి సిద్ధాంతి గారి మాట వేదవాక్కుగా భావించే చిన్నమ్మ… ఈ నెలలోనూ సీఎం పీఠం ఎక్కబోతున్నారు. ఈనెల 7న లేదా 9న శశికళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందట. సిద్ధాంతిగారు కూడా ఈ తేదీలే బెటరని చెప్పారట. దీంతో ఆ దిశగా చిన్నమ్మ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రమాణ స్వీకారానికి ముందు కూడా శశికళ కొన్ని ప్రత్యేక పూజలు చేస్తారని తెలుస్తోంది.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY