అవసరాలకి అంత పెరిగింది..

  avasarala srinivas remuneration
అవసరాల శ్రీనివాస్ …ఊహలు గుసగుసలాడే ,జ్యో అచ్యుతానంద సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇచ్చాడు.ఆ రెండు సినిమాలు కూడా ఒకే ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటికే చేశారు.ఇప్పుడు మూడో సినిమా కూడా అయన బ్యానర్ లోనే చేయబోతున్నారు.హీరో నాని .ఈ సినిమాకి అవసరాల 4 రెట్లు పైన పెంచాడట నిర్మాత.అంటే నాని తో చేయబోయే సినిమాకి అవసరాలకి దక్కేది రెండున్నర కోట్ల రూపాయలట.

జ్యో అచ్యుతానంద కి అవసరాల అందుకున్నది 60 లక్షలేనట.అంతక ముందు ఊహలు గుసగుసలాడే కి నెలవారీ జీతం తీసుకుని పని చేశారంట.ఆలా చేస్తే సినిమా పూర్తి అయ్యేసరికి అవసరాల తీసుకోగలిగింది కేవలం 15 లక్షలంట.సినిమాకి నాలుగు రెట్లు చొప్పున రెమ్యునరేషన్ పెంచుకోగలుగుతున్న అవసరాల లక్కీనే …పైగా అంతకన్నా ఎవరైనా ఎక్కువిస్తే వారికే సినిమా చేయమని కూడా సాయి కొర్రపాటి తన దర్శకుడిని ప్రోత్సహిస్తున్నారట.అయన మంచి మనసుకి కూడా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే ..

Post Your Coment
Loading...