పెళ్లిళ్ల సీజన్లో బ్రహ్మచారుల వల్లే నోట్ల రద్దు ?

Posted [relativedate]

Baba Ramdev On Notes Ban In Wedding Season
పెద్ద నోట్ల రద్దు గురించి ప్రధాని మోడీ మీద విపక్షాలతో పాటు శివసేన లాంటి మిత్రపక్షాలు కూడా విరుచుకుపడుతున్నాయి. అయితే ఈ విషయంలో మోడీని సమర్ధించేవాళ్ళకి కూడా ఓ అభ్యంతరముంది.అదేమిటంటే పెళ్లిళ్ల సీజన్లో పెద్ద నోట్లు రద్దు చేయడం. మోడీని పూర్తిస్థాయిలో సమర్ధించే రామ్ దేవ్ బాబా కూడా ఈ పెళ్లిళ్ల సీజన్ అయ్యాక అయితే బాగుండేదని ..జనానికి ఇంత ఇబ్బంది ఉండేది కాదని అన్నారు.అంతలోనే ఆయనో జోక్ వేశారు.బీజేపీ లో అంతా బ్రహ్మచారులు కావడం వల్లే వారికి ఇబ్బంది అర్ధం కావడం లేదని రామ్ దేవ్ బాబా అన్నారు.కాకపోతే ప్రధానికి పెళ్లి అయిన విషయాన్ని మోడీతో పాటు రాందేవ్ మర్చిపోయినట్టున్నారు.