ఆ శిక్ష వద్దు… నేనో చిన్న వర్కర్‌ని మాత్రమే

Posted April 21, 2017 (6 days ago) at 15:49

bahubali 'kattappa' sathyaraj say sorry to karnataka people
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి 2’ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌లో చాలా బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కానివ్వబోం అంటూ కన్నడిగులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో దర్శకుడు రాజమౌళి కన్నడలో మాట్లాడుతూ కన్నడిగులకు పెద్ద స్టేట్‌మెంట్‌నే విడుదల చేశారు. దాంతో కన్నడ జనాలు కాస్త సద్దుమణిగారు. ఈ విషయంపై కట్టప్ప సత్యరాజ్‌ కూడా స్పందించాడు. కన్నడిగులకు సారీ కూడా చెప్పాడు. గతంలో నేను కావేరీ నదీ జలాల విషయంలో నేను చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాయి.

నా మాటలు మిమ్మల్ని బాద పెడితే సారీ, నేను ‘బాహుబలి’ సినిమాలో చిన్న వర్కర్‌ని మాత్రమే. నాపై కోపంతో సినిమాని అడ్డుకోకండి. ‘బాహుబలి’ కన్నడలో విడుదల కానివ్వకుండా అంత పెద్ద శిక్ష విధించడం భావ్యం కాదు ప్లీజ్‌.. ‘బాహుబలి 2’ ఆదరించండి అంటూ సత్యరాజ్‌ స్పందించాడు. ఎట్టకేలకు ‘బాహుబలి’ చిత్రం కోసం సత్యరాజ్‌ కూడా దిగి వచ్చాడు. సత్యరాజ్‌ క్షమాపణలు చెప్పాడు కదా ఇప్పుడైనా కన్నడ జనాలు ‘బాహుబలి’ని ఆడనిస్తారు లేదా అంతే పట్టుదలతో ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది

Post Your Coment
Loading...