బాహుబలి 2 కథ ఇదేనా?

0
151

bahubali part 2 story

Posted September 23, 2016

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఈ భేతాళ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగింది బాహుబలి యూనిట్ లో ముఖ్యులు మాత్రమే.వాళ్ళు సినిమా విడుదల అయ్యేదాకా ఆ పని ఎటూ చెయ్యరు.అందుకే సృజనాత్మక ఉత్సాహం వున్న చాలా మంది బాహుబలి రెండో భాగం కథ గురించి తమదైన ఊహ బయటపెడుతున్నారు.అలా బాహుబలి 2 కథ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్న ఓ ఔత్సాహికుడి ప్రయత్నమిదిగో …

పార్ట్ -1 లో క్లైమాక్స్ లో కట్టప్ప అమరేంద్ర బాహుబలి ని వెన్ను పోటు పొడవమని చెప్పడంతో అక్కడ పార్ట్ 1 పూర్తి అవుతుంది. దాని తర్వాత కట్టప్ప మిగిలిన స్టోరీ శివుడు ( ప్రభాస్ ) కి చెబుతాడు. కాలకేయ రాజ్యం మీద గెలిచి విజయ జెండా ఎగరవేసిన  మహిష్మతి రాజ్యానికి రాజు గా అమరేంద్ర బాహుబలి అవుతాడు. మరో వైపు కన్న కొడుకు ( భల్లాల దేవా ) కి అన్యాయం జరిగింది అని బిజ్జల దేవ్ (నాజర్ ) కోపం తో రగిలి పోతారు.

అమరేంద్ర బాహుబలి పాలన లో  మహిష్మతి రాజ్యం అంత  భోగభాగ్యాలతో సంతోషం గా ఉంటుంది .  మహిష్మతి రాజ్యానికి కి దగ్గర లో వున్న కుంతల రాజ్యం మీద చిన్న చిన్న రాజ్యాలు  దండెత్తుతుంటాయి . కుంతల రాజ్యాని   ఎల్లప్పుడు కాపాడుకుంటుంది దేవసేన (అనుష్క ). ఆ రాజ్యం లో దేవసేన చెప్పిందే చట్టం…శత్రువు బలగాలు ని ఒంటి చేత్తో మట్టి కరిపించే ధైర్య శాలి. ఒక అనుకోని సంఘటన లో దేవసేన ని అమరేంద్ర బాహుబలి చూడటం తో అక్కడ నుండి వాళ్ళ మధ్య ప్రేమ మొదలు అవుతుంది. మరో వైపు ఆ విషయం తెలుసుకున్న  భల్లాల దేవా కూడా అనుష్క ని ఇష్టపడతాడు.

ఆ విషయం బిజ్జల దేవ్ కి తెలుస్తుంది. బిజ్జల దేవ్ (నాజర్ ) కుంతల రాజ్యానికి వర్తమానం పంపిస్తాడు.. ఆ విషయం తెలుసుకున్న దేవ సేన నిరాకరిస్తుంది. బిజ్జల దేవా శివగామి తో నీ సోంత కొడుకు అయిన  భల్లాల దేవా కి రాజు ని చేస్తావని ఆ రోజు అన్నావు…. కానీ మాట  తప్పావు .. ఇప్పుడు మన కొడుకు కి ఇష్టమైన ఆ దేవ సేన ని కూడా నువ్వు పెంచిన అమరేంద్ర బాహుబలి ఇష్టపడుతున్నాడు అని తన లో వున్న భాద ని శివగామి కి చెబుతాడు.

ఏనిర్ణయం తీసుకోవాలో అర్థం కానీ పరిస్థితి లో శివగామి ఆలోచన లో పడుతుంది. మరో వైపు  మహిష్మతి రాజ్యం చేతి లో ఓడిపోయినా కాలకేయ తమ్ముడు నింజా (చరణ్ దీప్) పగతో రగిలిపోతుంటాడు. కుంతల రాజ్యం నుండి విదేయుడు (సుబ్బరాజు )  వర్తమానాన్ని మహిష్మతి  రాజ్యానికి తీసుకువస్తాడు. బిజ్జల దేవా పంపిన  వర్తమానాన్ని కుంతల రాజ్యం దేవసేన తండ్రి తిరస్కరిస్తునట్టు విదేయుడు చెబుతాడు. ఆ సభలో భల్లలా దేవా కోపం తో విదేయుడు మీద దాడి చెయ్యటానికి దిగుతాడు. ఆ సమయం లో అమరేంద్ర బాహుబలి విదేయుడి (సుబ్బరాజు) కి అడ్డ వచ్చి విదేయుడిని కాపాడుతాడు.

బిజ్జల దేవా ఆ సభ లో మళ్ళి ఆ గొడవ ని రేపుతాడు. శివగామి అక్కడ జరుగుతుంది అంత చూస్తూ వుంటుంది. ఈ విషయం నా తల్లి శివగామి కి వదిలేస్తున్నానుఅని అమరేంద్ర బాహుబలి అంటాడు… సభ లో అంత శివగామి తీర్పు కోసం అందరు ఎదురు చూస్తూ వుంటారు. శివగామి రాజ్యం కావాలా ….! ప్రేమ కావాలో …..! తేల్చుకోమని ఆ నిర్ణయని అమరేంద్ర బాహుబలి కి వదిలేస్తుంది.

బాహుబలి చెప్పే సమాధానం కోసం అందరు ఎదురుచూస్తుంటారు . అమరేంద్ర బాహుబలి ప్రేమ కావాలని కోరుకుంటాడు…….బాహుబలి తీసుకున్న నిర్ణయం మహిష్మతి  ప్రజలలో ఆందోళన మొదలు అవుతుంది.  మహిష్మతి ప్రజలు అంత బాహుబలి రాజ్యం వదిలి వెళ్ళవద్దు అని వేడుకొంటారు…. మాకు బాహుబలి కావాలి అని. కానీ బాహుబలి   మహిష్మతి ని వదిలి అరణ్య వాసం పడతాడు. ఆ విషయం తెలుసుకున్న దేవసేన బాహుబలి కి తోడు గా వెళ్తుంది.

బాహుబలి బౌద్ధ మటం లో వుంటూ అక్కడ వున్నా వాతావరణం లో దేవసేన ని పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తూ వుంటాడు.  మహిష్మతి రాజ్యం అంత   భల్లాల దేవా (రానా) ఆధీనం లోకి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న  కాలకేయ రాజ్యానికి రాజు అయిన నింజా (చరణ్ దీప్) మహిష్మతి  రాజ్యం మీద దాడి చెయ్యటానికి సువర్ణ అవకాశం దొరుకుతుంది. మరో వైపు దేవ సేన తల్లి అయ్యింది అని కుంతల రాజ్యం అందరికి తెలుస్తుంది.

 మరో వైపు   రాజ్యం తో యుద్దానికి సిద్దం అవుతారు కాలకేయ సైన్యం అంత. ఆ యుద్ధం లో   మహిష్మతి రాజ్యానికి ( భల్లలా దేవ్ ) రానా నాయకత్వం వహిస్తాడు. ఆ యుద్ధ రణరంగ భూమి లో మొదటి రెండు దినాలు మహిష్మతి రాజ్యం లో సగం సైన్యం కాలకేయ చేతిలో నేల కూలతారు….. ఇంకో రెండు దినాల్లో మహిష్మతి  రాజ్యం కుప్ప కూలిపోతుంది అని తెలుసుకున్న శివగామి బాహుబలి కి వర్తమానం పంపిస్తుంది.

 ఆ విషయం తెలుసుకున్న బాహుబలి తిరిగి తన  భార్యతో కలసి  మహిష్మతి  రాజ్యానికి వస్తాడు. కుంతల రాజ్యం  మహిష్మతి  రాజ్యానికి సహాయం చేస్తుంది…. మరో వైపు బిజ్జల దేవా (నాజర్ ) బాహుబలి మళ్ళి తిరిగి వస్తే తన కొడుకు ని రాజ్యం నుండి తప్పిస్తారు అని తెలిసి   భల్లాల దేవా, బిజ్జల దేవా అనుకుంటారు….. ఒక వైపు   కాలకేయ చేతిలో ఓడిపోతాం అన్న భయం లేకుండా, తన అన్న తిరిగి వచ్చాడు అన్న భయం ఎక్కువ కనిపిస్తుంది.

 మహిష్మతి రాజ్యన్ని ఎలాప్పుడు నమ్మిన బంటు గా పనిచేసే కట్టప్ప (సత్య రాజ్) ని రాజు చెప్పిందే వేదం అనుకుని బాహుబలి ని వెన్నుపోటు పొడవమని   భల్లాల దేవ్, బిజ్జల దేవ్ చెబుతారు. కాలకేయ సైన్యం తో యుద్ధం కొనసాగుతుంది…ఆ యుద్ధం లో  కాలకేయ సైన్యం అంత కుప్పకూలుతుంది. యుద్ధం జరుగుతున్న సమయం లో బాహుబలి ని కట్టప్ప వెన్నుపోటు పొడుస్తాడు. ఆ యుద్ధ భూమి లో బాహుబలి చనిపోతాడు….

   మహిష్మతి రాజ్యం అంత ఆ వార్త విని  ఏడుస్తూ వుంటారు…. దేవ సేన 9 నెలలు గర్భవతి అవ్వటం వలన శివగామి అన్ని దగ్గర ఉండి చూసుకుంటుంది… రానా బాహుబలి మీద వున్నా కోపం తో   మహిష్మతి రాజ్యం లో వున్న ప్రజలని  హింసిస్తాడు . తనని కాదని బాహుబలి ని పెళ్లి చేసుకున్న దేవసేన ని చెరసాలలో బంధిస్తాడు. దేవసేన కి పుట్టిన బిడ్డని శివగామి పెంచుతుంది. బాహుబలి వారసుడి ని చంపాలని అనుకుంటాడు… కట్టప్ప ద్వారా ఆ విషయం శివగామి కి తెలుస్తుంది.

బాహుబలి ని తన కొడుకు – భర్త కలసి చంపించారు అని శివగామి కి తెలుస్తుంది.  భల్లాల దేవా బాహుబలి కొడుకుని చంపుదామని ప్లాన్ వేస్తాడు… ఆ విషయం తెలుసుకున్న శివగామి బాహుబలి కి పుట్టిన బిడ్డ తో రాజ్యం నుండి పారిపోతుంటే భల్లలా దేవా సైన్యం శివగామి ని చంపటానికి ట్రై చేస్తుంటారు … ఆ పోరు లో శివగామి ఆ పిల్లవాడిని ఒక గుడిసె వాళ్ళకి అప్పగించి చనిపోతుంది….. అక్కడితో కట్టప్ప బాహుబలి కి జరిగిన అన్యాయం గురించి శివుడి కి చెబుతాడు

….  భల్లాల దేవా శివుడు మీద పగ తో రగిలిపోతుంటాడు…. తన కొడుకు (బద్రుడు ) ని చంపిన శివుడు మీద పగ తో వున్నా  భల్లాల దేవా , మరో వైపు తన భర్త (బాహుబలి) చావు కి కారణం అయిన  భల్లాల దేవా ని చంపుతాను అని శబథమ్ చేసిన దేవ సేన కసి తో వుంటారు…. శివుడు తనకంటూ ఒక రాజ్యాని ఏర్పాటు చేసుకుంటాడు… ఆ రాజ్యం లో కుంతల రాజ్యం తోడవుతుంది .. శివుడి కి నమ్మిన బంటు గా కట్టప్ప వుంటే , వాళ్ళకి ఆయుధాలు సరపరా చేసే వ్యక్తిగా కిచ్చా సుదీప్ సహాయం చేస్తాడు.  మహిష్మతి రాజ్యానికి, శివుడి కి మధ్య జరిగే పోరు లో  మహిష్మతి రాజు అయిన   భల్లాల దేవా శివుడు చేతిలో ఓడిపోతాడు

 మహిష్మతి రాజ్యం లో అందరు చూస్తుండగా  దేవ సేన భల్లాల దేవా (రానా ) ని చితి మీద పేర్చి సజీవ దహనం చేస్తుంది…..ఆ బాధ తట్టుకోలేక బిజ్జల దేవా కోడుకు చితిని చూస్తూ కన్ను ముస్తాడు….
శుభం

NO COMMENTS

LEAVE A REPLY