బాలయ్య ఫ్యాన్స్ ఆధ్యాత్మిక యాత్ర..!

Posted November 10, 2016

bal11నందమూరి బాలకృష్ణ నటిస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా విజయవంతం కావాలని ఫ్యాన్స్ 100 రోజుల ముందుగానే 100 దేవాలయాలకు తిరిగేశత పుణ్యక్షేత్ర ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర చరిత్ర ఆధారంగా తెరకెక్కించబడుతున్న ఈ సినిమా కోసం బాలకృష్ణ కూడా చాలా కష్టపడుతున్నారు. ఫస్ట్ లుక్ టీజర్ తో ఫ్యాన్స్ సినిమా మీద అంచనాలను పెంచుకోగా సినిమా హిట్ ఆవాలనే ఉద్దేశంతో ఈ యాత్ర కొనసాగిస్తున్నారు.

బాలయ్య చేతుల మీదుగా ఈ యాత్ర మొదలు పెట్టారు. శాతకర్ణి సినిమా దర్శకుడు క్రిష్, బాలయ్య, సినిమా నిర్మాతలు జెండా ఊపి ఈ ఆధ్యాత్మిక యాత్రను మొదలు పెట్టడం జరిగింది. జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే వినోదపు పన్ను రాయితి కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఫ్యాన్స్ ఈ ఆధ్యాత్మిక యాత్రతో సినిమా క్రేజ్ మరింత పెంచేస్తున్నారు. 60 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా బాలయ్య కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలబడుతుందని చెప్పొచ్చు.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY