అమ్మ ఇంట బాలయ్య సందడి….

Balakrishna performs special pooja at Karimnagar Kotilingala templeనందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కరీంనగర్‌లోని తిరుమల థియేటర్‌లో వినూత్నంగా నిర్వహించారు.శాతకర్ణి తల్లి గౌతమి జన్మించిన కోటిలింగాల వద్ద ప్రత్యేక పూజల అనంతరం ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలయ్య అభిమానులు భారీగా పాల్గొన్నారు.

‘మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి, మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయము లేదు మిత్రమా శరణమా.. రణమా’ అంటూ బాలకృష్ణ తనదైన శైలి డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చారిత్రాత్మక చిత్రాన్ని అదే స్థాయితో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY