దర్శకుడిగా మారనున్న బాలయ్య..?

Posted February 13, 2017 (2 weeks ago)

balakrishna to direct and hero ntr biopic movieగౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు  బాలయ్య. రీసెంట్ గా తన తండ్రి నందమూరి తారకరామారావు జీవితచరిత్ర తెరకెక్కించనున్నామని బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఆ సినిమాలో తానే నటిస్తానని కూడా చెప్పాడు. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశాడు బాలయ్య.

ఇక  ఎన్టీఆర్ జీవిత చరిత్ర అన్న ప్రకటన రాగానే అటు అభిమానులతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో వివాదాస్పద అంశాలు ఉన్నాయి. ఈ అంశాలను బాలయ్య ఎలా తెరకెక్కిస్తాడు అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమాకు బాలయ్యే దర్శకత్వం వహించనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.  ఈ మేరకు బాలయ్య రైటర్ తోకలిసి కధా చర్చలు కూడా నిర్వహిస్తున్నాడట. స్క్రిప్ట్ వర్క్  పూర్తైన తర్వాత తానే దర్శకత్వం వహిస్తున్న సంగతి అధికారికంగా ప్రకటించున్నాడట  ఈ నందమూరి హీరో. ఇక ఈ సినిమాను నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి నిర్మించనున్నాడని తెలుస్తోంది. అందుకనే బాలయ్య ఈ ప్రకటన చేసినప్పుడు లోకేష్ కూడా పక్కనే ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా బాలయ్య స్పష్టమైన ప్రకటన ఇచ్చేవరకు ఇలాంటి కధలు వినిపిస్తూనే ఉంటాయి.

NO COMMENTS

LEAVE A REPLY