మ్యూజిక్ డైరక్టర్ కి బాలయ్య అంతలా?

Posted December 27, 2016

balayya praising music director
ఓ గొప్ప కళాకారుడిని లేదా సాంకేతిక నిపుణుడిని హీరోలు గౌరవించడం కొత్తేమీ కాదు ..అయితే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ మ్యూజిక్ డైరెక్టర్ కి పెద్ద హీరోలు ప్రాముఖ్యత ఇవ్వడం తక్కువగా చూస్తుంటాం.పైగా తామే ఎదగడానికి అవకాశమిచ్చినట్టు ఫోజులు కొట్టేవారు ఎక్కువే..ఆడియో వేడుకలో మాట్లాడిన కొద్దిసేపు ఈరోజు హీరో మ్యూజిక్ డైరెక్టర్ అంటూ మొక్కుబడి మాటలు చెప్తారు. కానీ గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ లో అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించింది .మ్యూజిక్ డైరక్టర్ చిరంతాన్ భట్ కి ఫంక్షన్ ఆద్యంతం ఎనలేని ప్రాముఖ్యత ఇచ్చారు.తెలుగుకి అయన కొత్త కావడంతో ప్రేక్షకులు మొదట్లో ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు .చూస్తున్న వాళ్లకి ఎవరో vip ని బాలయ్య ఎంగేజ్ చేస్తున్నారేమో అనిపించింది .

ఇక వేదిక మీద పాటలు విడుదల అయ్యే సందర్భంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ,కేంద్ర మంత్రి వెంకయ్య తదితరులకు మ్యూజిక్ డైరెక్టర్ ని ప్రత్యేకంగా పరిచయం చేశారు బాలయ్య .ఆద్యంతం అయన గౌరవమర్యాదలతో తడిసి ముద్దైన భట్ మళ్లీ బాలయ్య తో పనిచేసే అవకాశం ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేయడం ఖాయం అనిపిస్తోంది .

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY