కీరవాణి వ్యాఖ్యలపై ఫైరింగ్ మొదలయ్యింది..

Posted March 31, 2017 (4 weeks ago)

bhaskarabhatla and ramajogayya sastry comments on keeravaniబాహుబలి-2 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ముందు కీరవాణి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వేటూరి సుందరరామ్మూర్తి మరణాంతరం, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాయడం తగ్గించిన తర్వాత తెలుగు పాట అంపశయ్య ఎక్కిందని కీరవాణి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల ట్వీట్ల దాడి చేశారు.

అంపశయ్య మీద ఉన్న సినిమా పాటల సాహిత్యాన్ని కీరవాణిగారే కాపాడగలరు. అయిదే నిమిషాలైతే అది సరిపోద్ది (విక్రమార్కుడు  సినిమా కోసం కీరవాణి రాసిన ఓ పాటలోని లైన్‌) అని భాస్కరభట్ల  ట్వీట్‌ చేశాడు. ఆయన స్వీయ సంగీత దర్శకత్వంలోనే కాకుండా వేరే సంగీత దర్శకులకీ పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నానని,  వేటూరి, సిరివెన్నెల తర్వాత నాకు బాగా నచ్చిన పాటల రచయిత కీరవాణే  అంటూ భాస్కరభట్ల వ్యంగ్యంగా  ట్వీట్  చేశాడు. అలానే రామజోగయ్య శాస్త్రి కూడా ఐఫా అవార్డు వేదికపై కీరవాణి  ట్వీట్ల గురించి మండిపడ్డారు. మంచి సన్నివేశం ఇస్తే  ఇప్పటి గీత రచయితలు కూడా అద్భుతంగా రాయగలరని, చెత్త సన్నివేశం ఇస్తే సిరివెన్నెల కూడా చెత్తగానే రాస్తారు అని వేదికను ఆధారంగా చేసుకొని విమర్శించారు.

దీంతో మరోసారి కీరవాణి సంగీతం గురించి చర్చనీయాంశమైంది. అసలు కీరవాణి … రాజమౌళి సినిమాలకు తప్ప మిగిలిన సినిమాలకు సరైన సంగీతాన్ని అందించడని, అటువంటి కీరవాణి  తోటి సంగీత రచయితలను అవమానించకుండా తన సంగీతాన్ని తాను చూసుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు.

Post Your Coment
Loading...