నేడు భీష్మాష్టమి

Posted February 4, 2017

bhismastami festival story భీష్మాష్టమి:

ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరిస్తారు. ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద పొందు పరచిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి వుంటుంది. భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా జీవించి కడపట మహావిష్ణు సన్నిధిలో అతనిని కన్నుల పండువుగా చూస్తూ ముక్తిని పొందిన గొప్ప జీవి. ఈ ప్రక్రియను అందరు భీష్మ తర్పణం అని అంటారు. ఇక్కడ అందరికి ఒక సంశయం వస్తుంది . తర్పణాదులు తండ్రి లేని వారికి మనకు ఎందుకు? అని. కానీ ధర్మ శాస్త్రం చెప్పింది భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి వున్నవాళ్ళు కూడా చేయవచ్చని. అది ప్రతి ఒక్కరి ఆచరించగలిగితే మంచిది. రథ సప్తమి నాడు స్నానం ఆచరించడం వల్ల మనకు ఏడేడు జన్మలలో చేసిన పాపములు పోతాయని ఓనమ్మకం . ఆ నిర్మలమైన అంతఃకరణతో మనము భీష్మ పితామహునికి అర్ఘ్యం ఇవ్వవలసి వుంటుంది.

సంకల్పం అంతా చెప్పుకున్న తరువాత… భీష్మాష్టమి తర్పనార్ఘ్యం అస్య కరిష్యే – అపపౌ స్పృశ్య.. అంటూ ఈశ్లోకాలను చదవాలి…

1. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!!

2. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే!!

3. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!!

అనేన భీశం అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!
ఇది కేవలం సమాచారం మాత్రమే…దీన్ని గురించి తెలిసిన వారు మరింత సమాచారం ఇస్తే సంతోషం…

Post Your Coment
Loading...