“మిస్సమ్మ” మళ్లీ వస్తోందిగా

Posted February 7, 2017 (3 weeks ago)

bhumika is back to tollywood
ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది భూమిక. నటించింది కొన్ని సినిమాలే అయినా టాప్ హీరోల సరసన గుర్తిండిపోయే రోల్స్ లో నటించింది. అయితే పెళ్లైన తర్వాత తెలుగు సినిమాలను మినహాయించి మిగిలిన భాషల్లో నటిస్తూనే ఉంది. చివరగా అల్లరి నరేష్ మూవీ లడ్డుబాబులో కనిపించిన భూమిక గతేడాది ‘ఎంఎస్ ధోని’ బయోపిక్ లో సుశాంత్ రాజ్ పుత్ కు అక్కగా నటించింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది.

దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కబోతున్న నటరాజు సినిమాతో మరోసారి భూమిక తెలుగు వారిని పలకరించబోతోంది. ఈ సినిమాలో ఆమె నానికి అక్క పాత్రలో మెరవనుంది. ఆమె భర్త రోల్ లో ఓ పాపులర్ యాక్టర్ నటించనున్నాడని సమాచారం.
కాగా తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతోనే ఇందులో నటించేందుకు భూమిక ఒప్పుకున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. మరి ఈ సినిమాతో ఈ లెటెస్ట్ మిస్సమ్మ మళ్లీ తెలుగులో బిజీ అవుతుందేమో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY