రసవత్తరంగా రాష్ట్రపతి రేస్

 Posted May 4, 2017 (4 weeks ago) at 11:55

bjp and opposition parties are fight for india president candidateరాష్ట్రపతి ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు మునుపెన్నడూ లేని విధంగా కసరత్తులు చేస్తున్నారు. సోషల్ ఇంజినీరింగ్ తో అన్నివర్గాల్ని ఆకట్టుకునే పనిలో పడ్డ బీజేపీ.. దళితులకే రాష్ట్రపతి పదవి ఇవ్వాలని డిసైడైనట్లు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చెంద్ గెహ్లాట్ పేరు తెరపైకి తెచ్చిన కమలనాథులు.. ఇప్పుడు తాజాగా జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్నును హైలైట్ చేస్తున్నారు.

ఇటు విపక్షాలు కూడా కేంద్రానికి దీటుగా పావులు కదుపుతున్నాయి. తమను సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటిస్తే.. తమ ఉమ్మడి అభ్యర్థిని తాము నిలబెట్టాలని చర్చలు జరిగాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎస్పీ అధినేత ములాయం, ఆర్జేడీ చీఫ్ లాలూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో చర్చలు జరిపారు. అటు రాహుల్ కూడా అఖిలేష్ తో సంప్రదింపులు జరిపారు. విపక్షాల తరపున శరద్ పవార్ , గులాం నబీ ఆజాద్, ములాయంకు ఛాన్స్ కనిపిస్తోంది.

ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందరికీ అనుకూలుడుగా ఉన్నారు. ఆయనకు మరోసారి పొడిగింపు ఇవ్వాలని తృణమూల్ కోరుతోంది. మిగతా పార్టీలకు అభ్యంతరం ఉండకపోవచ్చు. బీజేపీకి ఆయనపై వ్యతిరేకత ఏమీ లేదు. అయితే కాంగ్రెస్ నేతను కొనసాగిస్తే.. తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్నారు మోడీ. అందుకే తమ పార్టీ భావజాలానికి అనుకూలమైన వ్యక్తినే ప్రథమ పౌరుడి పీఠంపై కూర్చోబెట్టాలని పావులు కదుపుతున్నారు.

Post Your Coment
Loading...