స్వామికి పోయేకాలమొచ్చిందా ?

Posted February 10, 2017 (3 weeks ago)

bjp leader subramanian swamy comments on tamil nadu politicsతమిళనాడు రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా నడుస్తున్నాయో అందరికీ తెలుసు.తిరిగే ప్రతి మలుపు శశికళకి వ్యతిరేకంగానే ఉంటోంది.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తనకి అండగా రంగంలోకి దిగుతుందని శశి భావించింది.అలా జరక్కపోవడంతో తానే ఓ మెట్టు దిగి కాంగ్రెస్ సాయం కోసం అర్ధించారు.అయినా ఫలితం లేదు.ఇక తమిళనాట చోటామోటా పార్టీలు నడుపుతున్న విజయ్ కాంత్,శరత్ కుమార్ కూడా శశి వర్గం ఎంత ప్రయత్నించినా నోరు మెదపలేదు. ఇక సినీ రంగం నుంచి ఆమెకి మద్దతు రాకపోగా శశికి వ్యతిరేకంగా అంటే పన్నీర్ కి అనుకూలంగా కమల్,గౌతమి లాంటి వాళ్ళు గళం విప్పారు.శశి పరిస్థితి ఇలా ఉంటే ..

ఇక పన్నీర్ కి అనుకూలంగా మాట్లాడేవారి సంఖ్య అంతకంతకీ పెరుగుతోంది.కానీ ఒక్క బీజేపీ నేతకి మాత్రం ఈ పరిణామం నచ్చడం లేదు.ఆయనే స్వామి.సుబ్రమణ్య స్వామి.బీజేపీ అధిష్టానం శశికి వ్యతిరేకంగా పావులు కదుపుతోందని తెలిసి కూడా ఆయన పన్నీర్ మీద విరుచుకుపడుతున్నారు.శశిని ఉన్నపళంగా సీఎం కుర్చీ మీద కుర్చోపెట్టాలని ఆరాటపడిపోతున్నారు. ఆ ఆరాటం చివరికి గవర్నర్ కి సలహాలు ఇచ్చేదాకా వచ్చింది.ఇంతకుముందు కేంద్ర ఆర్ధికమంత్రి జైట్లీ,RBI మాజీ గవర్నర్ రఘురామ రాజన్ మీద నోరు పారేసుకుంటే ..మోడీ సోషల్ మీడియా వేదికగా చీవాట్లు పెట్టాక కాస్త నోరు అదుపులోకి వచ్చింది.ఇప్పుడు తమిళనాడు వ్యవహారంలో మాత్రం బీజేపీ వైఖరికి పూర్తి భిన్నంగా స్వామి వ్యవహరిస్తున్నారు.ఇదంతా చూస్తుంటే బీజేపీ నుంచి స్వామికి పోయేకాలం వచ్చిందనిపిస్తోంది.మోడీ ఏలికలో అద్వానీ వంటి అగ్రనేతలే మౌనం వహిస్తుంటే స్వామి లాంటి వాళ్ళు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారా

NO COMMENTS

LEAVE A REPLY