తెలంగాణ రెడ్లకి ఓ పార్టీ,నేత కావలెను..

Posted April 26, 2017 (5 weeks ago) at 12:23

bjp party trying to aakarsh to telangana congress reddy mla candidates in bjp
తెలంగాణాలో రెడ్ల రాజకీయ ఆధిపత్యానికి సుదీర్ఘ కాలం తర్వాత బ్రేక్ పడింది.ఆ బ్రేక్ కెసిఆర్.ఆయన నడుపుతున్న తెరాస. ఆ స్పీడ్ బ్రేకర్ సైజు అంతకంతకు పెరిగిపోతోంది.దాన్ని అధిగమించడం ఎలా అన్నదే ఇప్పుడు తెలంగాణ రెడ్ల ముందున్న ప్రశ్న.రాష్ట్రం లో అత్యున్నత పదవి దక్కపోయినా సామాజికంగా,ఆర్ధికంగా,రాజకీయంగా ఇప్పటికీ రెడ్లది చెప్పుకోదగ్గ బలమే. కాకుంటే ఇన్నాళ్లు ఆ వర్గానికి అండగా వున్న కాంగ్రెస్ జాతీయ స్థాయిలో రోజురోజుకి చిక్కిపోతోంది.ఇక ఇక్కడ కూడా ఆ పార్టీ ని నమ్ముకుంటే ఎన్నికల ఏరు దాటగలమన్న నమ్మకం రెడ్లలో సడలిపోతోంది. అందుకే వారిప్పుడు కొత్త పార్టీ,కొత్త నేత కోసం ఎదురు చూస్తున్నారు.

తెలంగాణ రెడ్ల పరిస్థితిని గమనించి వారికి వల వేస్తున్న పార్టీల్లో ప్రధానమైనది బీజేపీ. జాతీయ స్థాయిలో ఆ పార్టీకి పెరుగుతున్న ఆదరణ ఆశగా చూపి బీజేపీ లోకి వారిని లాక్కోవాలని కమలనాధులు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.కాంగ్రెస్,టీడీపీ లోని రెడ్డి నాయకులతో పాటు కోదండరాం వంటి ఉద్యమనేతలని కూడా వదలకుండా బీజేపీ ట్రై చేస్తోంది.బీజేపీ పిలుపు ఊరిస్తున్నప్పటికీ కొత్త చోట తాము ఇమడగలమా అన్న సందేహం రెడ్డి నేతలని వేధిస్తోంది.పైగా ఇన్నాళ్లు తలో పార్టీ లో ఉన్నవాళ్ళంతా ఒకే చోట ఇమిడిపోవడం అంత తేలిగ్గాదు.వారి అవసరం వీరికి,వీరి అవసరం వారికి ఉన్నప్పటికీ ఇక్కడే బండి ముందుకు కదలడం లేదు.ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని సరైన వ్యూహం తో ఓ పార్టీ,నేత ముందుకొస్తే మాత్రం రెడ్లు అటు వైపు చూసే అవకాశాలు మెండుగానే వున్నాయి.

Post Your Coment
Loading...