ఆంధ్రప్రదేశ్ సాయం పై బీజేపీ..

0
70

  bjp said budget list ap

ఆంధ్రప్రదేశ్ సాయం పై బీజేపీ చెప్తున్న లెక్కలు ఇలా ఉన్నాయి.. 

ప్రాజెక్ట్ జాబితాపై ఇలా.
ఆంధ్రప్రదేశ్ కు మంజూరైన సంస్థలు
7 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎస్సీఆర్, నిట్, ఐఐఐటీ, కేంద్రీయ విశ్వ విద్యాలయం, పెట్రోలియం విశ్వ విద్యాలయం, గిరిజనవిశ్వ విద్యాలయం, ఎన్ ఐ డీ ఎం, ఎస్.పీ.యే, ఎన్.ఎసీ.ఈ.ఎస్, తదితరమైన 12 జాతీయ సంస్థలను కేటాయించడం జరిగింది.

విద్యాసంస్థలు (ప్రతిపాదించినవి / కేటాయించినవి)
– ఐఐటీ, తిరుపతి – రూ. 700 కోట్లు
– ఐఐఎం, విశాఖపట్నం రూ 680 కోట్లు
– ఐఐఎస్.ఈ.ఆర్ తిరుపతి రూ 870 కోట్లు
– ఐఐఐటీ,, చిత్తూరు జిల్లా రూ. 130 కోట్లు
– ఎన్ ఐటీ, తాడేపల్లి గూడెం రూ 300 కోట్లు
– నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రూ 250 కోట్లు
– విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిర్మాణం

దాదాపు గా పూర్తయింది.
– ఎయిమ్స్ గుంటూరు రూ. 1618 కోట్లు
– వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు
– పెట్రోలియం విశ్వవిద్యాలయం గుంటూరు
– విజయవాడ సూరంపల్లి వద్ద ఫ్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాతీయ సంస్థ (సీ.ఐ.పీ.ఈ.టీ) రూ. 25.4 కోట్లు

– వీటికి అదనంగా లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన 10 కంటే ఎక్కువ మెగా ప్రాజెక్టులను కూడా కేటాయిస్తున్నారు.

ఇన్ ఫ్రా స్ట్రక్చర్- మౌలిక వసతుల రంగం

పోలవరం ప్రాజెక్టు
– 2014 నాటి ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు.
– మొదటిరోజునే దీనికి సంబంధించి ఆర్డినెన్సు ఇచ్చారు.
– గత రెండు ఆర్థిక సంవత్సరాలలో 850 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది.
– జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన రోజు నుంచి అంటే 2014 జూన్ 2 వ తారీఖు నుంచి అన్ని వ్యయాలను పూర్తిగా కేంద్రమే భరిస్తుంది.
– రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల కేంద్రమంత్రి,

దాదాపు 65వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన రహదారి ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ కు ప్రకటించారు.
– 392 కిలోమీటర్ల జాతీయ రహదారులు
– అమరావతి చుట్టూ 186 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ (ఓ. ఆర్.ఆర్), వివిధ దశల నుంచి కొత్త రాజధానిని అనుసంధానించే రింగు రోడ్డు, ప్రపంచంలోనే అతి పెద్ద అవుటర్ రింగురోడ్డుగా రూపొంద బోతోంది.
– కొత్త రాజధాని అమరావతిని అనంతపురం నుంచి కర్నూలు మీదుగా అనుసంధానిస్తూ మొత్తం 452 కిలోమీటర్ల రహదారి ప్రాజెక్టు
– జాతీయ జలమార్గం 4- కృష్ణా గోదావరి నదుల్తో పాటుగా కాకినాడ- పుదుచ్చేరి జలమార్గపు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఒప్పందం

– విశాఖపట్టణం స్టీలు ప్లాంటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం, విశాఖపట్టణంలో వివిధ ప్రాజెక్టులను 38500 కోట్ల రూపాయలతో చేపట్టడం, 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూడటం గురించిన ఒప్పందం.
ఎనర్జీ – ఇంధన శాఖ

– ఆంధ్రప్రదేశ్ ను పవర్ ఆఫ్ ఆల్ ఒకటో దశ కార్యక్రమానికి ఎంపికచేయడం జరిగింది. దీని కింద దేశంలో కేవలం మూడే రాష్ట్రాలను ఎంపిక చేశారు. డిస్కమ్ లను మెరుగు పరచడానికి 2015 లో ఉదయ్ పథకంలో చేర్చడం కూడా జరిగింది.

– ఆంధ్రప్రదేశ్ లో 2500 మెగావాట్ల సామర్థ్యంతో రెండు సోలార్ పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఎస్. ఈ. సీ. ఐ. ఏపీ జెన్ కో, ఎన్.ఆర్.ఈ.డీ.క్యాప్ ల సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులు నడుస్తున్నాయి.

– అనంతపూర్ సోలార్ పవర్ పార్క్ ( 1500 మెగావాట్లు)

– కర్నూలు సోలార్ పవర్ పార్క్ (1000 మెగావాట్లు)

– హరిత ఇంధన ప్రాజెక్టులు (జీఈసీ) పథకాల కింద, ఆంధ్రప్రదేశ్ లోని హరిత ట్రాన్స్ మిషన్ కారిడార్ల కోసం రూ. 520 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు భారత్ మరియు జర్మనీల మధ్య ఋణ ఒప్పందానికి కూడా సంతకాలు జరిగాయి.

– దీన దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన కింద రూ.328.60 కోట్ల రూపాయల వరకూ గ్రామీణ విద్యుద్దీకరణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది.
విమానాశ్రయాలు

– విజయవాడ విమానాశ్రయం – ప్రస్తుతం ఉన్న ప్రయాణికుల టర్మినల్ యొక్క సామర్థ్యాన్ని పెంచటం జరిగింది. కీలక సమయాల్లో వందమంది ప్రయాణీకుల నుంచి 250 మంది ప్రయాణీకులకు వీలుగా విస్తరించడం

– తిరుపతి విమానాశ్రయం- అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం జరిగింది. సరికొత్త సమీకృత టర్మినల్ భవనాన్ని 700 మంది ప్రయాణికులకు అనువుగా ఉండేలా రూపొందించారు. వీటిలో 500 మంది దేశీయ, 200 మంది అంతర్జీతీయ ప్రయాణీకులకు వీలుండేలా చేశారు.

– విశాఖపట్టణం విమానాశ్రయం ప్రస్తుత సమీకృత టర్మినల్ భవనం హుద్ హుద్ తుఫానుకారణంగా దారుణంగా దెబ్బతినడంతో తుఫాను ముగిసిన తర్వాత 5రోజుల వ్యవధిలోనే తిరిగి వాడకంలోకి వచ్చేలా బాగుచేయడం జరిగింది.

– రాజమండ్రి విమానాశ్రయం – రాత్రివేళల్లో ల్యాండ్ అయ్యే ఏర్పాటు అందుబాటులోకి వచ్చింది.

– కడప విమానాశ్రయం – కడప విమానాశ్రయం స్థాయి పెంచడం పూర్తయింది. కొత్త టర్మినల్ భవనాన్ని ప్రారంభించడం కూడా జరిగింది.
రైల్వేలు

– 2014-15 లో రూ.804 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 2015-16 లో ఆంధ్రప్రదేశ్ కు రూ.2554 కోట్లను కేటాయించారు.

– కాకినాడ వద్ద మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటైంది. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ సంస్థ రూ. 450 కోట్లతో ఏర్పాటైంది.

– ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు మార్చడం జరిగింది. విశాఖ పట్టణం నుంచి న్యూ ఢిల్లీకి కొత్త సూపర్ ఫాస్ట్ రోజువారీ రైలును ప్రారంభించడం జరిగింది.

– విజయవాడ, తిరుపతి రైల్వేస్టేషన్లలో హై స్పీడ్ వై ఫై హాట్ స్పాట్ ల ఏర్పాటు.
జాతీయ సంస్థలు

అనంతపురం జిల్లా పాల సముద్రం వద్ద నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సయిజ్ అండ్ నార్కొటిక్స్ ఏర్పాటుకు రూ. 600 కోట్లు
నెల్లూరు జిల్లా చింతలదీవి గ్రామం వద్ద 2000 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ కామధేను పశు ఉత్పత్తి సంస్థ ఏర్పాటు
ఇతరత్రా

నెల్లూరులో దివ్యాంగులకు శిక్షణ ఇచ్చేందుకు మానసిక ఆరోగ్యం మరియు పునరావాస ప్రాంతీయ కేంద్రం, భవనాల నిర్మాణానికి రూ. 20 కోట్లు, ఖర్చులకు రూ. 4కోట్లు కేటాయింపు

విజయవాడలో ప్రత్యేకమైన దూరదర్శన్ కేంద్రం ఏర్పాటు చేసి 2014 లో సెప్టెంబరులో ప్రారంభించడం జరిగింది. ఈ కేంద్రానికి పింగళి వెంకయ్య గారిపేరు నామకరణం

విజయవాడలో రీజినల్ పాస్ పోర్టు ఆఫీసు ఏర్పాటు

పట్టణాభివృద్ధి మరియు గృహనిర్మాణం

భారత ప్రభుత్వం నుంచి 3827 కోట్ల రూపాయలకు మించిన కేటాయింపులు. హడ్కో నుంచి 7500 కోట్ల రూపాయల ఋణం

ఆంధ్రప్రదేశ్ లో మూడు స్మార్ట్ నగరాలను ఎంపిక చేయడం జరిగింది. విశాఖపట్టణం, కాకినాడ (మొదటిదశలోను) తిరుపతి (రెండోదశ)- రూ.1500 కోట్లతో అభివృద్ది చేస్తున్నారు.

అందరికీ ఇళ్ళు కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ కు 1,93,147 ఇళ్లను కేటాయించడం జరిగింది. మొదటిదశలో మిగిలిన అన్ని రాష్ట్రాలకంటే ఏపీకే ఎక్కువగా ఇచ్చారు.

రూ. 100 కోట్ల కేటాయింపులు, గుంటూరు భూగర్భ డ్రైనేజీ పథకానికి రూ. 540 కోట్లు, విజయవాడ వరదనీటి డ్రైనేజీకి రూ. 460 కోట్లు

ఆంధ్రప్రదేశ్ లోని 33 పట్టణాలకు అమృత్ పథకం వర్తింపు
స్వచ్చ భారత్ కు రూ. 588 కోట్లు

హౌసింగ్ మరియు అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (హడ్కో) వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 7500 కోట్ల రుణం. కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కోసం వెసులుబాటు.

చారిత్రక నగరం అమరావతికి హృదయ్ పథకం కింద రూ. 22 కోట్లు

2015 లోనే విజయవాడ మెట్రో కు సూత్రప్రాయంగా అంగీకారం.
మంత్రిత్వ శాఖలోని ప్రీ పీఐబీ వారి ద్వారా డీపీఆర్ ను సమర్పించి ఆమోదించడం జరిగింది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో పీఐబీ సమావేశం జరగాల్సి ఉంది. విశాఖ పట్టణం మెట్రో డీపీఆర్ వివిధ మంత్రిత్వ శాఖల మధ్య ఇంకా చర్చల దశలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తొలుత స్మార్ట్ సిటీ మిషన్ నుంచి మినహాయించడం జరిగింది. ఇప్పుడు స్మార్ట్ సిటీ చాలెంజ్ పోటీలో పాల్గొనేందుకు అనుమతించారు.
వాణిజ్యం మరియు పరిశ్రమలు

విశాఖ పట్టణం – చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయడానికి 1430 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. చెన్నై- బెంగుళూరు కారిడార్ కూడా ఆంధ్రప్రదేశ్ గుండానే వెళుతుంది.

7 వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు – రూ. 700 కోట్లు, ఖర్చుచేస్తే మరిన్న నిధులు విడుదలకు అంగీకారం.

హుద్ హుద్ తుఫాను పరిహారం – రూ. 650 కోట్లు

నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం అంతర్జాతీయ లెదర్ కాంప్లెక్స్ (కే.పీ.ఐ.ఎల్.సీ) ఏర్పాటు. 277.93 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో, భారత ప్రభుత్వం రూ. 125 కోట్లను భరిస్తున్నది.

నెల్లూరు లోని తడ వద్ద భారతీయ అంతర్జాతీయ సెజ్ రూ.240 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ఏర్పాటైంది. ఇందులో కేంద్ర ప్రభుత్వపు నిధులు రూ. 105 కోట్లు.

గుంటూరు జిల్లాలో 120 ఎకరాల్లో సైన్స్ పార్క్, దినుసులు ప్రత్యేకంగా మిరపకాయల మార్కెట్ కు కేంద్రంగా ఏర్పాటు.
కమ్యునికేషన్స్ అండ్ ఐటీ

విశాఖలో సమీర్ కేంద్రం (సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ రిసెర్చ్)
రూ/ 80 కోట్లు

దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో వుడా మరియు ఎస్.టీ.పీ.ఐ ల సంయుక్త భాగస్వామ్యంతో ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ల నిర్మాణం.

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు మొబైల్ కమ్యునికేషన్ వ్యవస్థలను బీ.ఎస్.ఎన్.ఎల్ (లైవ్) లలో ద్వారా ఏర్పాటు చేయడానికి 277.42 కోట్ల రూపాయలు.

రక్షణ

బొబ్బిలి వద్ద నౌకాదళ ఎయిర్ స్టేషన్ ప్రతిపాదన – అంచనా వ్యయం రూ.3266.50 కోట్లు
రెండు దశల్లో అభివృద్ధి

కృష్ణా జిల్లాలోని నాగనాయలంక వద్ద డీ.ఆర్.డీ.వో వారి క్షిపణి పరీక్షల వసతుల ఏర్పాటుకు రూ. 1000 కోట్లు

కర్నూలుకు సమీపంలో 2900 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ ఓపెన్ ఎయిర్ రేంజి ఏర్పాటుకు ప్రణాళిక జరుగుతోంది. ఇది రక్షణ శాఖ అప్లికేషన్లకు పరీక్షా కేంద్రంగా ఉంటుంది. – రూ.500కోట్లు

అనంతపురం జిల్లాలోని పాలసముద్రం వద్ద భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ను ప్రారంభించడం జరిగింది. అత్యుత్తమ వసతుల ఏర్పాటుకు, క్షిపణి భాగాల తయారీ, కూర్పులను నిర్వహించడానికి రూ. 600 కోట్లు.

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో కొక్కిరాల కొండ వద్ద 1102.30 ఎకరాల విస్తీర్ణంలో భూములను సేకరించడం జరిగింది. ఇక్కడ ట్రూప్స్ మరియు పర్సనల్ శిక్షణ కేంద్రానికి రూ. 500 కోట్లు

మచిలీపట్నం సమీపంలో నిమ్మకూరు వద్ద ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (భెల్) తన ఆప్టిక్స్ తయారీ విభాగాన్ని మచిలీపట్నం-
విజయవాడ రహదారి సమీపంలో విస్తరించడం జరుగుతోంది.దీనికోసం రూ. 100 కోట్లు కేటాయింపు

ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం

గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఎయిమ్స్ ఏర్పారు – రూ.1618 కోట్లు
విజయవాడ మరియు అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను పీ.ఎమ్.ఎస్.వై మూడో దశ కింద స్థాయి పెంపు – రూ. 240 కోట్లు
ఆంధ్రప్రదేశ్ లో కాంపోజిట్ ప్రాంతీయ కేంద్రానికి 2016 జనవరి 3న శంకుస్థాపన చేయడం జరిగింది.

విశాఖలో ఈ.ఎస్.ఐ ద్వారా 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు వైద్య కళాశాల ఏర్పాటు

విశాఖపట్టణంలో ఈ.ఎస్.ఐ ద్వారా 200 పడకల దంత వైద్య ఆసుపత్రి మరియు కళాశాల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో యోగా మరియు ప్రకృతి వైద్యంలో జాతీయ పరిశోధన సంస్థ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం
పెట్రోలియం మరియు సహజవాయువులు

రాష్ట్రంలో 52 వేల కోట్ల వ్యయంతో మూడు పెట్రో ప్రాజెక్టులు ఏర్పాటు, విస్తరణ పనులు

విశాఖపట్టణంలో బీ.పీ.సీ.ఎల్ ద్వారా కొత్త ఎల్పీజీ ప్లాంట్ 120 కోట్లు
రూ. 18400 కోట్ల వ్యయంతో రిఫైనరీ విస్తరణకు విశాఖ పట్టణంలోని హెచ్.పీ.సీ.ఎల్ వారికి హరిత ఆమోదం. దీనిద్వారా ఏటా 8.33 మిలియన్ టన్నుల నుంచి 15 మిలియన్ టన్నులకు స్థాయి పెంపు.

పర్యావరణానికి సంబంధించిన ఇబ్బందులు ఉండటంతో కొన్ని సంవత్సరాలుగా దీనికి అనుమతులు లభించడం లేదు. ప్రస్తుతం భారత ప్రభుత్వం 2016 జనవరిలోనే ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అవసరమైన రక్షణ ఏర్పాట్లతో ముందుకెళ్ళాల్సిందిగా సూచించింది.

గ్రామీణాభివృద్ధి

తాగునీటి సదుపాయం, గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం ద్వారా రూ. 656.15 కోట్ల విడుదల
జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్.ఆర్.డీ.డబ్యూ.పీ) పథకాలు- రూ. 456.15 కోట్లు
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీ.ఎం.జీ.ఎస్.వై) – రూ. 200 కోట్లు
నౌకారంగం

భారతప్రభుత్వం ద్వారా మొత్తం రూ.1665 కోట్లు విడుదల
క్వే బెర్తుల పునరుద్దరణర( ఈక్యూ 2,3,4,5) లకు – రూ. 600 కోట్లు
మల్టి మోడల్ లాజిస్టిక్ హబ్ – రూ.372 కోట్లు
ఈక్యూ 1 బెర్తుకు దక్షిణం వైపున ఈక్యూ 1 ఏ బెర్తు అభివృద్ధి – రూ.313 కోట్లు

అంతర్ హార్బర్ మలుపుల సర్కిల వద్ద డ్రెడ్జింగ్ మూడో దశ చేపట్టడానికి రూ. 280 కోట్లు

బీవోటీ విధానంలో కంటైనర్ రవాణా స్టేషన్ ను ఏర్పాటు చేయడానికి – రూ. 100 కోట్లు

పర్యాటక రంగం

కోనసీమ, కాకినాడ హోప్ ద్వీపం అభివృద్ధి – రూ. 69.83 కోట్లు
తిరుపతిలో భారతీయ పాకశాస్త్ర సంస్థ – రూ. 100 కోట్లు
నెల్లూరు తీరప్రాంత పర్యాటక సర్క్యూట్ అభివృద్ధికి – రూ.61 కోట్లు
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో డ్రెగ్జింగ్ కార్పొరేషన్ ఏర్పాటు
ఎరువులు మరియు రసాయనాలు

విశాఖలో గ్రీన్ ఫీల్డ్ పెట్రో కెమికల్ కాంప్లెక్సు మంజూరుకు ప్రకటన
విశాఖ పట్టణంలో, నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఎన్.ఐ.పీ.ఈ.ఆర్) సంస్థ ఏర్పాటు ప్రకటన
5000 మందిని విద్యనభ్యసించే వీసు కల్పిస్తూ విజయవాడ సమీపంలో బీటెక్ మరియు ఎంటెక్ కోర్సులను అందించేలా ఫ్లాస్టిక్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాతీయ సంస్థ ప్రకటన
రూ. 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయనే అంచనాలతో ఆంధ్రప్రదేశ్ లో వైద్య పరికరాల ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయం

ఆర్థిక మంజూరులు

భారత ప్రభుత్వం ద్వారా మొత్తం రూ. 34,426.23 కోట్లు కేటాయింపు
2014- 15 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వనరుల వ్యత్యాసాన్ని పూరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి రూ.2303 కోట్ల గ్రాంటు విడుదల
కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా – రూ. 22,637.97 కోట్లు
రెవిన్యూ లోటు పూడ్చడానికి సాయంగా గ్రాంటు – రూ.6609 కోట్లు
గ్రామీణ స్థానిక సంస్థలకు సాయంగా గ్రాంటు – రూ. 934.34 కోట్లు
పట్టణ స్థానిక సంస్థలకు సాయంగా గ్రాంటు – రూ. 348.92 కోట్లు
రాష్ట్ర విపత్తు యాజమాన్య నిధికి – రూ. 393కోట్లు
ఆర్థిక గ్రాంట్లు

అమరావతిలో నూతన రాజ్ భవన్, అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలకు గాను బడ్జెట్ ద్వారా 2014- 15 లో రూ 1500 కోట్లు మరియు 2015 -16 సంవత్సరంలో రూ. 350 కోట్లు
ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ. 700 కోట్ల కేటాయింపులు.
2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో నోటిఫై చేసిన వెనుకబడిన ప్రాంతాలకు ప్రోత్సాహకాలు.
కొత్తగా సమీకరించే ఆస్తులవిలువలో 15 శాతం అదనపు పెట్టుబడి అలెవెన్స్.
ఉత్పాదక సంస్థలలో ఏర్పాటు చేసిన కొత్త యంత్రాల వాస్తవ విలువలో 20 శాతానికి బదులుగా, 35 శాతం అదనపు తరుగుదల.
నిధులు

రాబోయే అయిదేళ్లలో ఏటా రూ. 41,364 కోట్లు లభించేలా ఆంధ్రప్రదేశ్ కు మొత్తం రూ. 2,06,819 కోట్లు లభిస్తాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అయిదేళ్లపాటూ ఒక్కో ఏడాదిలో అదనంగా రూ.29,374 కోట్లు లభిస్తాయి. 13వ ఆర్థిక సంఘంతో పోల్చినప్పుడు 14వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా ఈ అదనపు మొత్తం లభిస్తుంది.

త్వరలోనే ప్రారంభం అయ్యేవి

విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం
గ్రీన్ ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీ అండ్ పెత్రో కెమికల్ కాంప్లెక్స్
ఆంధ్రప్రదేశ్ కు కొత్త రైల్వేజోన్
దుగ్గరాజపట్నం ఓడరేవు
మన్నవరం ప్రాజెక్టు పునరుద్ధరణ
జలరవాణాకు వీలుగా బకింగ్ హామ్ కాలువ పునరుద్ధరణ
నెల్లూరులో ఎన్.సీ.ఈ.ఆర్.టీ. కేంద్రం
నెల్లూరు మరియు గుంటూరుల్లో క్యాన్సర్ యూనిట్లు
కాకినాడలో ఫారిన్ ట్రేడ్ ఇన్స్టిట్యూట్
అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం
గుంటూరులో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ

NO COMMENTS

LEAVE A REPLY