బ్యాంకు లాకర్ల పై దాడులు?

Posted November 11, 2016

black money holders attack on bank lockers
పెద్ద నోట్ల రద్దుతో బడా బాబులకు షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ మరో సర్జికల్ స్ట్రైక్ కి రెడీ అయిపోతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.ఈ సారి దాడి బడా బాబుల లాకర్ల మీదని తెలుస్తోంది.ఇందుకోసం కేంద్ర ఆర్ధిక శాఖ కొన్ని మార్గదర్శకాలు కూడా రూపొందిస్తున్నట్టు సమాచారం. లాకర్లలో ఇంకా పెద్ద ఎత్తున లెక్కల్లోకి రాని డబ్బుతోపాటు భారీగా బంగారం ఉండొచ్చన్న అనుమానంతో ఈ చర్యకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుంది.

కేంద్ర ఆలోచన ప్రకారం లాకర్లపై కొద్ది రోజుల్లోపే దాడులు జరిగే అవకాశం వుండొచ్చట.తహశీల్ధార్ లేదా సీఐ స్థాయి అధికారి సమక్షంలో లాకర్ ఓపెన్ చేస్తారు. లాకర్ లో పట్టుబడ్డ బంగారానికి లెక్క చూపాలి.కొన్న బంగారానికి రసీదులు ఉండాలి.600 గ్రాముల కన్నా ఎక్కువ బంగారం ఉంటే ఐటీ లెక్కలు చూపాలి.ఇదే గనుక నిజమైతే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టే .

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY