రద్దు తో బుద్ధి వస్తుందా ..?

Posted [relativedate]

black money holders attitude changed because of old notes banned
పెద్ద నోట్ల రద్దు తో బుద్ధి వస్తుందా .? నల్ల కుబేరుల జాడ్యం ఇంటితో భారత దేశాన్ని వదిలేస్తుందా..? 16 రోజులుగా సామాన్యుడు పడుతున్న కష్టానికి ఫలితం వుంటుందా ..? పెద్దనోట్ల రద్దు తొందరపాటు చర్యా? ప్రజల ఇబ్బందుల్ని ప్రభుత్వం సరిగా అంచనా వేయలేకపోయిందా? ఈ నిర్ణయం ప్రభావంతో కలిగే నష్టాలేంటి? లాభాలేంటి?

ఆర్ధిక నిపుణుల అంచనాలు ఎలా వున్నాయంటే ఇప్పటికే రద్దు ఆలస్యం అయ్యింది అనేలా వున్నాయి ఎటువంటి చర్యలు ముందస్తుగా చెప్పి చేసేవి కాదని అంటున్నారు ఐతే నగదు బట్వాడా కేంద్రాలను సంసిద్ద చేసి ఉంటే ఈ ఇబ్బంది వుండేది కాదని ఆ అసౌకర్యం తప్పిస్తే… ఇందులో ఎలాంటి పొరపాటు లేదు అంటున్నారు . నల్లధనాన్నీ, వాటి ప్రభావాల్ని అరికట్టడానికి, ఉగ్రవాదానికి పెట్టుబడిని ఆపటానికి, నకిలీ నోట్లను తప్పించటానికి తప్పకుండా ఇది దోహదపడుతుంది.

1978 లో పరిస్థితికి ఇప్పుడు పరిస్థితి కి చాల తేడా వుంది పెద్దనోట్లు పేదవాళ్ల దగ్గరా ఉన్నాయి. అందుకే ఇప్పుడింతగా ప్రజలకు ఇబ్బంది ఎదురవుతోంది. ముందుముందు ఈ చర్య తప్పకుండా సత్ఫలితాలనిస్తుంది. ప్రజల ఇబ్బందులను గమనించి చిన్ననోట్లను ఎక్కువగా సరఫరా చేయాలి. నల్లధనం అరికట్టడానికి పెద్దనోట్ల రద్దనేది కేవలం ప్రాధమిక చర్య మాత్రమే నట . ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అవినీతి మూలాలను కట్టడి చేయటానికి ఎన్నికల వ్యయంపై ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించాలి. ఎన్నికల్లో పార్టీల ఖర్చును ప్రభుత్వమే భరించాలి. తద్వారా చాలా అవినీతిని కట్టడి చేయవచ్చు. అందుకోసం ఎన్నికల సంస్కరణలు తేవాలి. అంతేగాకుండా పాలనాపరంగా చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరముంది. రానున్న రోజుల్లో బినామీలు , హవాలా పై ద్రుష్టి పెట్టాల్సిన అవసరం వుంది అనే అభిప్రయం వ్యక్తం ఆవుతోంది