రజినికాంత్ పై బాలీవుడ్ కస్సు బుస్సు..!

0
24

Posted November 22, 2016 (2 weeks ago)

Bollywood Media Fires On Rajinikanthఆదివారం జరిగిన 2.0 ఫస్ట్ లుక్ కార్యక్రమంలో రజినికాంత్ అక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అయితే ఆ సందర్భంలో తనకు ఓ ప్రశ్న ఎదురైంది తనలాంటి హీరో ఇమేజ్.. స్టార్డం.. ఉన్న హీరోలు బాలీవుడ్లో ఎవరైనా ఉన్నారా అంటే ‘నో కామెంట్’ అనేశాడు రజిని. అయితే తన ఆలోచన ప్రకారం ఒకరు పేరు చెబితే మరొకరు హర్ట్ అవుతారనే ఉద్దేశంతో ఇలా అని ఉంటారని తెలుస్తుంది. కాని ఈ విషయం గురించి ముంబై మీడియా మాత్రం రచ్చ రచ్చ చేస్తుంది.

రజినిలాంటి స్టార్డం ఉన్న హీరో బాలీవుడ్ లో లేడు అన్న విషయం ఎంతవరకు కరెక్ట్ అన్నది వారి ప్రశ్న. నో కామెంట్ అని తప్పించుకున్నా సరే రజినిని బీ టౌన్ మీడియా మాత్రం ఆడేసుకుంటుంది. అయినా ఏమాటకామాట చెప్పాలి కాని రజిని నో కామెంట్ అనడం వాస్తవమే.. అంతేకాదు దేశం మొత్తం మీద కూడా రజినికాంత్ స్టార్డం తో పోటీ పడే హీరో ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఏదొకటి అనాలి అనే కాన్సెప్ట్ కాకపోతే అసలు రజినికాంత్ అన్న దానిలో ఎలాంటి తప్పు కనబడట్లేదు.

ఇక అనుకున్నట్టుగా ఫస్ట్ లుక్ తో అంచనాలను పెంచేశాడు శంకర్. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తనకన్నా అక్షయ్ గురించి సినిమా రిలీజ్ తర్వాత ఎక్కువగా మాట్లాడతారని రజిని అనడం అందరిని ఆశ్చర్యంలో పడేసింది.

NO COMMENTS

LEAVE A REPLY