భారతీయులకు బ్రిటిషర్ షాక్

Posted May 19, 2017 (2 weeks ago) at 11:32

british richest man fergus wilson comments don't give home for rent to indiansవిదేశాల్లో భారతీయులకు ఎదురవుతున్న చిక్కుల్లో ఇదో కొత్త కోణం అనుకోవచ్చు. బ్రిటిష్ సంపన్నుడు ఫెర్గూస్ విల్సన్ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. భారతీయులకు అనూహ్యమైన షాక్ ఇస్తోంది. ఇంతకీ ఫెర్గూస్ ఏం చేశారంటే…భారత్ పాక్ జాతీయులకు ఇళ్లను కిరాయి ఇవ్వొద్దంటూ ఫెర్గూస్ తన ఏజెంట్లకు ఈమెయిల్స్ పంపించారు. ఈ విషయం బయటకు పొక్కి రచ్చ రచ్చ అయి కోర్టు గుమ్మం తొక్కినప్పటికీ ఫెర్గూస్ ఏ మాత్రం తొణకకపోవడం గమనార్హం.

వెయ్యికి పైగా ఇళ్లున్న సంపన్నుడైన ఫెర్గూస్ ఇంత ఆగ్రహం వ్యక్తం చేసేందుకు కారణం మన వాళ్ల వంటకాలు! భారతీయుల వంటకాల వాసన తీవ్ర ఇబ్బందికరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఫెర్గూస్ మనవాళ్లు ఇళ్లు ఖాళీ చేశాక భారతీయ వంటకాల వాసన వస్తుందని చిర్రుబుర్రులాడారు. ఇండియన్ల రంగు గురించి కాదు నా అభ్యంతరం. వాళ్ల వంటకాల గురించి. భారతీయులు ఇళ్లు ఖాళీ చేసిన తర్వాత కూడా ఫ్లాట్ లలో వాళ్ల వంటకాల ఘాటు అదిరిపోతోంది. తిరిగి కార్పెట్లు వేయించడం సమస్యగా మారుతోంది.అందుకే వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వను అంటూ తేల్చిచెప్పారు.

భారతీయులపై విధించిన ఈ నిషేధంపై నిరసనలు మొదలయ్యాయి. ఫెర్గూస్ నిర్ణయాన్ని తప్పుపడుతూ బ్రిటన్ మానవ హక్కుల సంస్థ ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కోర్టులో సవాలు చేసింది. ఫెర్గూస్ నిర్ణయాన్ని నిలిపేస్తూ ఆదేశాలివ్వాలని సెంట్రల్ లండన్ కౌంటీ కోర్టును కోరామని సంస్థ ప్రతినిధి రెబెక్కా హిల్సెన్రథ్ తెలిపారు. ఈవిషయంలో తీర్పు వెలువడాల్సి ఉంది.

Post Your Coment
Loading...