అమరావతి లో మైక్రోసాఫ్ట్ త్వరలో..లోకేష్

Posted November 18, 2016

nllore yuva chaitanya yatra

 

అంధ ప్రదేశ్ రాజధాని అమరావతి లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ను ఎరపాటు చేస్తున్నట్టు లోకేష్ చేప్పారు . 1996 లో హైదరాబాద్ లో సైబరాబాద్ ను నిర్మించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కతుందని . టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ అన్నారు నెల్లూరు లోని నారాయణ మెడికల్ కళాశాలలో జరిగిన సమావేశంలో మాట్లాడారు . యువ చైతన్య యాత్రలో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ యువతలో చైతన్యం కలిగిస్స్తున్న అని అన్నారు .సింగపూర్ గురించి కూడా మొదట్లో విమర్శలు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం అమరావతి ని కూడా ఆ స్థాయి లో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత యువత మీదే ఉందని అన్నారు. మాటలు చెప్పే వారికంటే చేతలు చేసేవారిని నమ్మాలని ,అభివృద్ధి అంటే తెలియని వారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నార ని అన్నారు. హైదరాబాద్ కి జాతీయ స్థాయి లో గుర్తింపు తెచ్చింది చంద్రబాబు అని , ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రతినిధులువచ్చారని త్వరలో అమరావతి లో డెవలప్మెంట్ సెంటర్ స్థాపించనున్నట్టు చెప్పారు .ఆంధ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేసారు .

కేంద్రంతో విబేధాలు పెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుందని చెప్పారు. తమ కుటుంబ ఆస్తులను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామన్నారు. సింగపూర్‌లో అవినీతికి పాల్పడితే ఉరిశిక్షలు వేస్తారని అలాంటి దేశంతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నామంటూ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రపంచమే అసూయపడేలా అమరావతి నిర్మాణం ఉంటుందని లోకేష్ స్పష్టం చేశారు. నారాయణ వైద్య కళాశాలలో యువచైతన్య యాత్రలో లోకేష్ విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించారు

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY