జగన్ కు జైలు కాదు బెయిల్…న్యూజిలాండ్ టూర్ కు లైన్ క్లియర్

 Posted April 28, 2017 (4 weeks ago) at 13:37

cbi court judgement favour to jagan about on bail cancellation caseవైసీపీ అధినేత జగన్ ని జైలు కు పంపించాలనుకున్న సిబిఐ కి చుక్కెదురైంది.. ఆయన బెయిల్ ని రద్దు చేయాలని సిబిఐ వేసిన పిటిషన్ ను కోర్ట్ కొట్టేసింది.సాక్ష్యులని ప్రభావితం చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని సిబిఐ ప్రధానంగా ఆరోపించింది. సాక్షి ఛానెల్ లో మాజీ CS రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ ప్రాతిపదికగా చేసుకొని ఈ పిటిషన్ వేసింది. అయితే కోర్ట్ అందుకు నిరాకరించడంతో జగన్ కి ఊరట లభించింది.. వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది..

జగన్ కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్ పర్యటించేందుకు నాంపల్లి ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. జగన్ బెయిలు రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేసిన కోర్టు….కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ లో పర్యటించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్ మేరకు ఆయనకు విదేశీ పర్యటనకు అనమతి ఇచ్చింది.

Post Your Coment
Loading...