నోట్లు రద్దు చేస్తే చెబుతాం…

0
38

Posted November 19, 2016 (2 weeks ago)

central govt clarify on 500 1000 rs notes changing process closed dateకొత్త నోట్లన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే పాత నోట్ల మార్పిడిని రద్దు చేయాలని కేంద్రం భావిస్తోందని . కేంద్రం తొలుత ప్రకటించిన విధంగానే డిసెంబర్ చివరి వరకూ నోట్ల మార్పిడికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే నోట్ల మార్పిడి కాలపరిమితిని పొడిగించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. నోట్ల మార్పిడిని నిలిపివేస్తున్నారంటూ నిన్న సాయంత్రం వెబ్‌సైట్స్‌లో వచ్చిన వార్తలు సామాన్యుడిని భయాందోళనకు గురి చేశాయి.అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. శుక్రవారం రాత్రి ఈ విషయంపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. 500, 1000 నోట్ల మార్పిడిని బ్యాంకులు నిలిపివేయనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY